వెండితెరకు ‘స్లమ్ గాడ్స్’ జీవితం! | Shekhar Kapur's next on SlumGods has AR Rahman | Sakshi
Sakshi News home page

వెండితెరకు ‘స్లమ్ గాడ్స్’ జీవితం!

Published Sun, Dec 7 2014 10:15 PM | Last Updated on Sat, Sep 2 2017 5:47 PM

వెండితెరకు ‘స్లమ్ గాడ్స్’ జీవితం!

వెండితెరకు ‘స్లమ్ గాడ్స్’ జీవితం!

 దాదాపు ఐదేళ్ల క్రితం వచ్చిన ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రం గురించి అందరికీ తెలుసు. ఎ.ఆర్. రహమాన్‌కి ఆ సినిమా జంట ఆస్కార్ అవార్డులు తెచ్చిపెట్టిన విషయమూ తెలిసిందే. ముంబయ్‌కి చెందిన జుహూలోని మురికివాడకు సంబంధించిన ఓ యువకుడి కథతో ప్రధానంగా ఈ చిత్రం సాగుతుంది. కాగా, ఇప్పుడదే ముంబయ్ మహానగరంలో ప్రసిద్ధి పొందిన ధారావి అనే మురికి వాడ నేపథ్యంలో శేఖర్ కపూర్ ఓ చిత్రం రూపొందించనున్నారు. మట్టిలో మాణిక్యాలు ఉంటాయనే భావనతో ఈ మురికివాడలో ఉన్న పిల్లల్లోని ప్రతిభను వెలికి తీసేలా ఆకాశ్ దంగర్ అనే వ్యక్తి ‘స్లమ్ గాడ్స్’ అనే గ్రూప్‌ని ప్రారంభించారు.
 
  పిల్లలను చదివించడంతో పాటు, వారికి ఆసక్తి ఉన్న విషయాల్లో శిక్షణ ఇప్పించడం, యువతీ యువకుల్లో చైతన్యం నింపడం ఈ స్లమ్ గాడ్స్ ఉద్దేశం. ఈ గ్రూప్‌లో ఉన్న సభ్యుల్లో ‘హిప్ హాప్’ నేర్చుకుని, మంచి గుర్తింపు తెచ్చుకున్నవాళ్లు ఉన్నారు. స్లమ్ గాడ్స్‌ని ఆరంభించిన ఆకాశ్, హిప్ హాప్ ద్వారా ప్రసిద్ధి పొందిన ఆ సభ్యుల  జీవితం ఆధారంగా సంగీత దర్శకుడు ఎ.ఆర్. రహమాన్‌తో కలిసి శేఖర్ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం. మరో విశేషం ఏంటంటే..  స్లమ్ గాడ్స్‌లోని ధారావికి చెందినవారితోనే కథ రాయించడంతో పాటు, వాళ్లతోనే దర్శకత్వం వహింపజేయాలనుకుంటున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement