
మా సినిమాకి టైటిల్ దొరికేసిందోచ్ అంటున్నారు శ్రద్ధా కపూర్. విషయం ఏంటంటే రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధాకపూర్ జంటగా ఓ హర్రర్ కామెడీ సినిమా రూపొందుతోంది. గురువారం ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూట్ స్టార్ట్ అయింది. ‘స్త్రీ’ అని టైటిల్ ఫిక్స్ చేశామని అనౌన్స్ చేశారు.
‘‘ఈ సినిమాలో మీరు భయపడుతూనే నవ్వేస్తుంటారు’’ అంటూ క్లాప్‌బోర్డ్ ఫొటోని షేర్ చేశారు శ్రద్ధా కపూర్. ఆ క్లాప్ బోర్డ్ వెనుక ‘ఓ స్త్రీ కల్ ఆనా’ అని రాసి ఉంది. అంటే.. ‘ఓ స్త్రీ రేపు రా అని అర్థం’. ఈ హర్రర్ కామెడీ మూవీకి తెలుగు దర్శక–ద్వయం రాజ్–డీకే రచయితలుగా వ్యవహరించడంతో పాటు సహనిర్మాతలుగా కూడా చేస్తున్నారు. మాడాంక్ ఫిలింస్ బ్యానర్‌పై దినేష్ విజయ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అమర్ కౌషిక్ దర్శకత్వం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment