సోషల్‌ మీడియాలో శ్రియ హాట్ ఫొటోలు హల్‌చల్ | Shriya hot photo in Social media | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాలో శ్రియ హాట్ ఫొటోలు హల్‌చల్

Published Sun, Jan 7 2018 8:54 AM | Last Updated on Wed, Apr 3 2019 9:16 PM

Shriya hot photo in Social media - Sakshi

ఎవరు అవునన్నా, కాదన్నా సినిమా అనేది గ్లామర్‌ ప్రపంచమే. సినిమాల్లో గ్లామర్‌ అనేది సింహభాగాన్నే పోషిస్తోంది. ఇటీవల ఒక దర్శకుడు హీరోయిన్లున్నది అందాలారబోత కోసమేనని, ప్రేక్షకులు వారిని అలానే కోరుకుంటారని బహిరంగంగానే అన్నారు. ఆ తరువాత హీరోయిన్ల ఆగ్రహానికి గురైయ్యారనుకోండి. అది వేరే విషయం. వాస్తవం ఏమిటంటే ఈ తరం హీరోయిన్లు వ్యాంప్‌ పాత్రల నటీమణులను మరిపిస్తున్నారని చెప్పకతప్పదు. అదే మంటే పాత్రల డిమాండ్‌ మేరకే, దర్శక నిర్మాతల కోరిక కారణంగానే అంటూ సాకులు వెతుక్కునే ప్రయత్నాలు చేస్తుంటారు. నటి శ్రియ తాజాగా ఫొటో సెషన్‌ చేసి మరీ తీయించుకున్న స్టిల్స్‌ను చూసిన వారెవరైనా అలానే అనుకుంటారు.  ఈ ఉత్తరాది భామ మంచి నటే. కాదనే సాహసం ఎవరూ చేయరు. బహుభాషా నటి కూడా తెలుగు, తమిళం, హిందీ అంటూ పలు భాషల్లో ప్రముఖ హీరోలతో జతకట్టి మెప్పించారు. ముఖ్యంగా కోలీవుడ్‌లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నుంచి, విజయ్, ధనుష్‌ అంటూ పలువురు స్టార్‌లతో నటించారు.

 నాలుగు దశాబ్దాల (37) వయసు దగ్గర పడుతున్న ఈ ప్రౌఢ ఇప్పటికీ హీరోయిన్‌గా బిజీగానే ఉన్నారు. ఇటీవల తెలుగులో పైసా వసూల్‌ అంటూ బాలకృష్ణతో చిందులేసిన శ్రియ తాజాగా రెండు తెలుగు, ఒక తమిళం, ఒక హిందీ అంటూ నాలుగు చిత్రాల్లో నటిసున్నారు. అయినా ఇంకొంత కాలం అగ్రనాయకిగానే రాణించాలన్న కోరికో, లేక తనలో అందాలింకా తగ్గలేదనిపించుకోవాలన్న ఆశనో గానీ, నా అందం చూడండయ్యా అన్నట్లుగా టాప్‌లెస్‌గా అర్ధనగ్న ఫోజులతో ఫొటో తీయించుకుని వాటిని సోషల్‌ మీడియాలకు అందే లా చేసుకున్నారు. ఆ ఫొటోలను నెటిజన్లు తమ వెబ్‌సైట్లలో దుమ్మురేపుతున్నారు. వీటిని చూసిన కొందరు అభిమానులు ముఖం చిట్లించుకుంటున్నారు.  ఆ ఫొటోలను మస్త్‌గా ఎంజాయ్‌ చేసే వారూ లేకపోలేదు. మొత్తం మీద శ్రియ ఈ విధంగా కలకలం రేపుతున్నారన్నమాట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement