‘లాభం’ మొదలైంది..! | Shruti Haasan and Vijay Sethupathi Team Up For The First Time | Sakshi
Sakshi News home page

‘లాభం’ మొదలైంది..!

Published Tue, Apr 23 2019 10:04 AM | Last Updated on Tue, Apr 23 2019 10:04 AM

Shruti Haasan and Vijay Sethupathi Team Up For The First Time - Sakshi

క్రేజీ జంట విజయ్‌సేతుపతి, శ్రుతీహాసన్లు లాభం అంటూ కలిశారు. వీరిద్దరు కలిసి నటిస్తున్న సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కథానాయకుడిగా విజయపథంలో దూసుకుపోతున్న నటుడు విజయ్‌సేతుపతి. ఈయన నిర్మాతగానూ విజయాలను అందుకుంటున్నారు. ఇక సంచలన నటిగా పేరు తెచ్చుకున్న శ్రుతీహాసన్‌ చిన్న గ్యాప్‌ తరువాత మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యారు. వీరిద్దరి రేర్‌ కాంభినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రమే లాభం.

ఇక ఆరంజ్‌ మిఠాయ్, జుంగా, మేర్కు తొడర్చి మలై వంటి చిత్రాలను నిర్మించారు విజయ్‌సేతుపతి. సొంత నిర్మాణ సంస్థ విజయ్‌సేతుపతి ప్రొడక్షన్‌ నాలు పోలీసుమ్‌ నల్లారుంద ఊరుమ్, ఒరు నల్ల నాళ్‌ పార్తు సొల్రేన్‌ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను నిర్మించిన 7సీఎస్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ కలిసి నిర్మిస్తున్న భారీ చిత్రం లాభం.

ఇకపోతే ఇయర్కై, ఈ, పేరన్బు, పొరంబోక్కు వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఎస్‌పీ.జననాథన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం సోమవారం ఉదయం రాజపాళైయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. అద్భుతమైన కథతో అదిరే యాక్షన్స్‌ సన్నివేశాలతో పూర్తి కమర్శియల్‌ చిత్రంగా తెరకెక్కిస్తున్న లాభం చిత్రం విజయ్‌సేతుపతి, శ్రుతీ హాసన్‌ల కెరీర్‌లో గుర్తుండిపోయేలా ఉంటుందని దర్శకుడు తెలిపారు.

ఇతర నటీనటులను వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. చిత్రానికి రాంజీ ఛాయాగ్రహణను, డీ.ఇమాన్‌ సంగీ తాన్ని అందిస్తున్నారని తెలిపారు. పూర్తిగా పాజిటీవ్‌ దృక్పథంతో ప్రారంభించిన లాభం చిత్రంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఇప్పటి నుంచే నెలకొంటున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement