శ్రుతీహాసన్
‘‘కెరీర్‌లో చాలా మంది నిర్మాతలు నాకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్‌ని ఎగ్గొట్టారు. కానీ నిర్మాతగా నేనలా చేయను’’ అంటున్నారు శ్రుతీహాసన్. యాక్టర్‌గా, సింగర్‌గా తన టాలెంట్‌ను పరిచయం చేశారు శ్రుతీహాసన్. ప్రస్తుతం నిర్మాతగానూ మారిన సంగతి తెలిసిందే. జయప్రకాశ్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహించబోయే ‘ది మస్కిటో ఫిలాసఫీ’ చిత్రాన్ని నిర్మించనున్నారామె. నిర్మాతగా ఎలాంటి సినిమాలు నిర్మిస్తారని శ్రుతీని అడగ్గా – ‘‘నేను చేయాలనుకొని, చేయలేకపోయిన సినిమాలను నా బ్యానర్‌పై నిర్మిస్తాను. బిజినెస్ పరంగానూ భలే ఆసక్తిగా ఉంది.
ఎందుకంటే... నిర్మాతగా నేను ఎంచుకునే సినిమాలు ఎలా ఆడతాయి? అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఆ స్క్రిప్ట్స్‌ని మార్కెట్ పరంగానూ వర్కౌట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతీ కథ చెప్పాలి. నిర్మాణంలో నాకు ఎటువంటి అనుభవం లేదు. మా అమ్మగారు చూసుకుంటున్నారు. ఆవిడకు అనుభవం ఉంది. అనుభవం ఉన్న నిర్మాతల దగ్గర సలహాలు, సూచనలు తీసుకుంటాను. అనుభవం లేకపోయినప్పటికీ నా యాక్టింగ్ కెరీర్ నిర్మాణం గురించి నాకో విషయం నేర్పింది. నాతో పని చేసే యాక్టర్స్‌కు, టీమ్‌కు సరైన రెమ్యునరేషన్ ఇవ్వాలని తెలిపింది. నా నిర్మాణంలో పని చేసే వాళ్లందరికీ నల్ల ప్రొడ్యూసర్ (మంచి నిర్మాత) అవ్వాలనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment