సింగీతంతో సినిమా చేయడం మర్చిపోలేని అనుభూతి - భారతీకృష్ణ
సింగీతంతో సినిమా చేయడం మర్చిపోలేని అనుభూతి - భారతీకృష్ణ
Published Fri, Sep 20 2013 12:14 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
సింగీతం ఓ ప్రయోగశాల. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా సింగీతం చేసిన ప్రయోగం ‘వెల్‌కమ్ ఒబామా’. శాండల్‌వుడ్ మీడియా పతాకంపై సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో భారతి, భారతీకృష్ణ నిర్మిం చిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.
ఈ సందర్భంగా భారతీకృష్ణ చెబుతూ -‘‘తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన సీరియల్స్, రియాల్టీ షోలు నిర్మించాం. సుమలతగారితో చేసిన ‘బతుకు జట్కా బండి’ మాకు మంచి మలుపు అయ్యింది. తొలి ప్రయత్నంగా సింగీతంగారితో సినిమా చేయడం ఓ మర్చిపోలేని అనుభూతి. ఆసక్తికరమైన మలుపులతో సాగే ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.
ఊర్మిళ, రేచల్, ఎస్తబన్, సంజీవ్, భువనచంద్ర, అనంతశ్రీరామ్, నిరంజని, తదితరులు ఇందులో నటించారు. తదుపరి సింగీతం దర్శకత్వంలోనే సంగీతం ప్రధానంగా ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు భారతీకృష్ణ చెప్పారు.
Advertisement
Advertisement