‘మీరెప్పుడైనా ప్రధానమంత్రి కావాలనుకున్నారా’ | Sir Did You Ever Wish To become the PM Fan Asked To Amitabh | Sakshi
Sakshi News home page

అమితాబ్‌ను ప్రశ్నించిన నెటిజన్‌

Published Sat, Apr 18 2020 4:37 PM | Last Updated on Sat, Apr 18 2020 5:09 PM

Sir Did You Ever Wish To become the PM Fan Asked To Amitabh - Sakshi

లాక్‌డౌన్‌ నేపథ్యంలో షూటింగ్‌లు నిలిచిపోవడంతో బాలీవుడ్‌ స్టార్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. చాలామంది సెలబ్రిటీలు తమకు నచ్చిన పనులతో ఎంజాయ్‌ చేస్తూ లాక్‌డౌన్‌ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో లాక్‌డౌన్‌లో ఇంట్లో ఉంటున్న బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఓవైపు కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే మరోవైపు సోషల్‌ మీడియాలోనూ ఆక్టివ్‌గా ఉంటున్నారు. అయితే ప్రస్తుతం ఇంట్లో ఉన్న బిగ్‌బీ అభిమానులతో ఇంటారాక్ట్‌ అయ్యే ఏ అవకాశాన్ని వదులుకోరు. సోషల్‌ మీడియలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిస్తున్నారు. (తండ్రి కోసం చాక్లెట్‌ కేక్‌ చేసిన పూజా..)

ఇటీవల ఓ నెటిజన్‌ అమితాబ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర ప్రశ్న అడిగారు. ‘ సార్‌.. మీరు ఎప్పుడైనా ప్రధానమంత్రి కావాలని అనుకున్నారా’ అని బిగ్‌బీని ప్రశ్నించారు. దీనికి అమితాబ్‌ నవ్వుతూ సమాధానమిచ్చారు. ‘అరే.. పొద్దుపొద్దునే మంచి విషయాలు చెప్పండి.’ అంటూ నెటిజన్‌ ప్రశ్నకు సరదా సమాధానమిచ్చారు. ఇక అమితాబ్‌ ఇచ్చిన సమాధానం నెటిజన్ల చేత నవ్వూలు పూయిస్తోంది. (‘దూరమైనా.. స్నేహంగానే ఉన్నాం’)

పెద్దాయన సన్‌ గ్లాసెస్‌ వెతకండ్రా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement