మిత్రుడి ఫిర్యాదు.. బిగ్‌ బీ చమత్కారం! | Amitabh Bachchan Gave Funny Reply To His Friend Who Asks Ignoring Him | Sakshi
Sakshi News home page

స్నేహితుడికి అమితాబ్‌ ఫన్నీ రిప్లై

Published Mon, Oct 5 2020 1:21 PM | Last Updated on Mon, Oct 5 2020 2:32 PM

Amitabh Bachchan Gave Funny Reply To His Friend Who Asks Ignoring Him - Sakshi

ముంబై: తనని పట్టించుకోవడం లేదని స్నేహితుడు అన్న మాటలకు బాలీవుడ్‌ బీగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ తనదైన శైలిలో సరదాగా సమాధానం ఇచ్చారు. బిగ్‌బీ లాక్‌డౌన్‌లో తనకు సంబంధించిన విషయాలను, ఆసక్తికర సంఘటలను, సరదా సన్నివేశాలను తరచూ సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ఆక్టివ్‌గా ఉన్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ ముగియడంతో సినిమా షూటింగ్‌లు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటి షో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ షూటింగ్ కూడా‌ ప్రారంభం కావడంతో ఆయన బిజీ అయిపోయారు. ఈ షోకు సంబంధించిన విషయాలను ఆయన అప్పడప్పుడు ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోగా పంచుకుంటున్నారు. (చదవండి: కేబీసీ12 సీజన్‌ 25 లక్షల ప్రశ్న.. ఆన్సర్‌ చెప్పండి)

తనని విస్మరిస్తున్నారని అమితాబ్‌ స్నేహితుడొకరు ఫిర్యాదు చేయడంతో బిగ్‌బీ సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు సమాధానం ఇచ్చారు. సోమవారం ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ... ‘నా స్నేహితుడు ఒకరు నాతో ‘అమిత్‌ జీ.. మీరు నన్ను పట్టించుకోవడం లేదు’ అని అన్నాడు. అయితే 12 నుంచి 15 గంటలు పని చేసి అలసిపోతున్న నాకు కేవలం నిద్రపోడానికే సమయం​ దొరుకుంది. కానీ మిమ్మల్ని విస్మరించే సమయం దొరకట్లేదు’ అంటూ బిగ్‌బీ చమత్కరించాడు. కాగా ఇటీవల బిగ్‌బీ సుజీత్‌ సర్కార్‌ దర్శకత్వంలో వచ్చిన గులాబో సితాబోలో ఆయుష్మాన్‌తో కలిసి నటించారు. ఈ చిత్రం ఇటీవల అమెజాన్‌ ప్రైం విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో బిగ్‌బీ నటనకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రాగా.. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. (చదవండి: ఆ డాక్యుమెంట‌రీ పేరు చెప్ప‌ను: అమితాబ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement