షూటింగ్‌ పూర్తి చేసుకున్న ‘దొరసాని’ | Sivatmika and Anand Deverakonda Debut Movie Wraps Up Shoot | Sakshi
Sakshi News home page

షూటింగ్‌ పూర్తి చేసుకున్న ‘దొరసాని’

Published Thu, May 2 2019 1:08 PM | Last Updated on Sun, Jul 7 2019 11:45 AM

Sivatmika and Anand Deverakonda Debut Movie Wraps Up Shoot - Sakshi

సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసింది. దొరసాని పేరుతో తెరకెక్కుతున్న సినిమాతో హీరో రాజశేఖర్‌ రెండో కూతురు శివాత్మిక హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. తెలంగాణ నేపథ్యంలో ఎమోషనల్‌ లవ్‌స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కేవీఆర్‌ మహేంద్ర దర్శకుడు.

పెళ్లి చూపులు నిర్మాత యష్ రంగినేని, మధుర శ్రీధర్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా చిత్రకరణ పూర్తయ్యింది. త్వరలోనే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించేందుకు చిత్రయూనిట్ సిద్ధమవుతున్నారు. ఒకే సినిమాతో ఇద్దరు స్టార్‌ వారసులు పరిచయం అవుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement