అమ్మ నిర్మాత.. కొడుకు దర్శకుడు | Smita Thackeray proud of her son for Balasaheb's biopic | Sakshi
Sakshi News home page

అమ్మ నిర్మాత.. కొడుకు దర్శకుడు

Published Tue, Jun 21 2016 6:07 PM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM

అమ్మ నిర్మాత.. కొడుకు దర్శకుడు

అమ్మ నిర్మాత.. కొడుకు దర్శకుడు

ముంబై: శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత బాల్ ఠాక్రే జీవితకథను వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఈ సినిమాకు ‘సాహెబ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాకు బాల్ ఠాక్రే కోడలు స్మితా ఠాక్రే నిర్మాత కాగా, ఆయన మనవడు, స్మిత కొడుకు రాహుల్ దర్శకుడు కావడం విశేషం. బాల్ ఠాక్రే జీవితకథ ఆధారంగా తీస‍్తున్న ఈ సినిమాకు తన కొడుకు రాహుల్ దర్శకత్వం వహించడం తనకు సంతోషంగా ఉందని స్మిత చెప్పారు.

‘బాలాసాహెబ్ ఎప్పుడూ లెజండ్లా బతికారు. కుటుంబానికి, అనుచరులకు ఆయన ఓ ప్రశ్నలాంటి వారు. ఆయన జీవిత ప్రయాణంలో ఓ భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాం. సాహెబ్ జీవితకథను తెరకెక్కించే బాధ్యతను ఆయన మనవడు రాహుల్ తీసుకున్నాడు’ అని స్మిత తెలిపారు. వచ్చే అక్టోబర్లో ఈ సినిమా ప్రారంభంకానుంది. నటీనటులను ఇంకా ఎంపిక చేయాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement