Balasaheb Thackeray
-
మూడింటిలో ఏదో ఒక గుర్తు ఇవ్వండి.. ఈసీకి షిండే ప్రతిపాదనలు
ముంబై: అంధేరీ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు తమకు మూడు గుర్తుల్లో ఒకటి కేటాయించాలని ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపింది ఏక్నాథ్ షిండే వర్గం శివసేన. సుర్యూడు, కత్తి-డాలు, రావి చెట్టు గుర్తులను పరిశీలించాలని కోరింది. మరి ఈ మూడింటిలో ఎన్నికల సంఘం ఏది ఖరారు చేస్తుందో చూడాలి. అసలైన శివసేన తమదంటే తమదే అని ఉద్ధవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే వర్గం వాదిస్తున్న నేపథ్యంలో శివసేన పార్టీ పేరు, ఆ పార్టీ ఎన్నికల గుర్తు విల్లు-బాణాన్ని ఈసీ తాత్కాలికంగా సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే నవంబర్ 3న జరిగే అంధేరీ ఉపఎన్నికల కోసం కొత్త పార్టీ పేరు, ఎన్నికల గుర్తుకు సంబంధించి షిండే, థాక్రే వర్గాలు ఈసీకి కొన్ని ప్రతిపాదలను పంపాయి. వీటిని పరిశీలించిన అధికారులు థాక్రే వర్గానికి 'శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే)' పేరు, కాగడా గుర్తును సోమవారం ఖరారు చేసింది. అలాగే షిండే వర్గానికి 'బాలాసాహెబ్ శివసేన' పేరును ఫైనల్ చేసింది. కానీ షిండే అడిగిన ఎన్నికల గుర్తులు కొన్ని ఇప్పటికే రిజిస్టర్ అయినందున ఎలాంటి గుర్తును కేటాయించలేదు. మళ్లీ కొత్త ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే షిండే వర్గం మంగళవారం సూర్యుడు, కత్తి-డాలు, రావిచెట్టు గుర్తుల్లో ఒకటి కేటాయించాలని ఈసీని మళ్లీ కోరింది. చదవండి: థాక్రే వర్గానికి పార్టీ పేరు గుర్తు ఖరారు చేసిన ఈసీ.. షిండేకు షాక్! -
ఈసీ నిర్ణయంతో అయోమయం.. థాక్రే కొత్త పార్టీ పేరు, గుర్తు ఇవే!
ముంబై: శివసేన పార్టీ, ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం తాత్కాలికంగా ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో నవంబర్ 3న జరిగే తూర్పు అంధేరీ ఉపఎన్నికల్లో ఈ పార్టీ పేరు, గుర్తును ఉపయోగించడానికి ఉద్ధవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే వార్గాలకు వీల్లేకుండా పోయింది. రెండు వర్గాలు పార్టీ తమదంటే తమదని చెప్పినా ఈసీ ఎవరికీ కేటాయించలేదు. దీంతో థాక్రే వర్గం కొన్ని ప్రతిపాదనలను ఈసీ ముందుకు తీసుకెళ్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. తూర్పు అంధేరీ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు తమకు 'శివసేన బాలా సాహెబ్ థాక్రే', లేదా 'శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే' పార్టీ పేర్లలో ఏదో ఒకదాన్ని కేటాయించాలని కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్నికల గుర్తుగా త్రిశూలం, లేదా ఉదయించే సూర్యుడి చిత్రాన్ని కేటాయించాలని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. తమ మొదటి ఎంపిక శివసేన బాలా సాహెబ్ థాక్రే, త్రిశూలం గుర్తు అని, అవి కుదరకపోతే రెండో ఆప్షన్‌కు ఈసీ ఓకే చేయాలని థాక్రే వర్గం కోరుతోంది. అసలైన శివసేన తమదంటే తమదని థాక్రే, షిండే వర్గాలు వాదించడంతో ఆ పార్టీ పేరు, విల్లు-బాణం గుర్తును ఈసీ శనివారం తాత్కాలికంగా ఫ్రీజ్ చేసింది. వచ్చే ఉపఎన్నికల్లో వీటిని ఉపయోగించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. రెండు వర్గాలు పార్టీ పేరు, ఎన్నికల గుర్తుకు సంబంధించి మూడు ఆప్షన్లతో తమ ముందుకు రావాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే థాక్రే వర్గం కాస్త ముందుగా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. శివసేన బాలాసాహెబ్ థాక్రే పార్టీ పేరు, త్రిశూలం గుర్తు తమకు వస్తుందని ఆశిస్తోంది. చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి.. సీఎం దిగ్భ్రాంతి -
చివరి శ్వాస వరకు మోదీ స్నేహాన్ని గౌరవించారు, కానీ ఆయన మాత్రం..
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతున్న సంగతి తెలసిందే. ఇక ఈ రాజకీయ పోరులో విజయం కోసం ఒకరిపై మరొకరు తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేసుకుంటున్నారు. తాజాగా శివసేన ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అరవింద్ సావంత్ ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శివసేనను అంతం చేయడానికి కుట్ర పన్నడం ద్వారా బాలాసాహెబ్ (బాల్ ఠాక్రే)కు ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తిరుగుబాటు చేస్తున్న ఎమ్మెల్యేలకు వారు కూడా బాలాసాహెబ్‌కు ద్రోహం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిణామాలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)నే కారణమని శివసేనలో అందరూ భావిస్తున్నారని, అది నిజమైనా ఆశ్చర్యపోనక్కర్లేదని సావంత్ అన్నారు. ‘‘2002 గుజరాత్ అల్లర్ల తర్వాత అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మోదీని ముఖ్యమంత్రిగా బర్తరఫ్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ బాలాసాహెబ్ వాజ్‌పేయిని అలా చేయవద్దని ఒప్పించారు. 'అగర్ మోడీ గయా, పార్టీ గయీ.' (మోడీ పోతే, బీజేపీగుజరాత్‌ను కోల్పోతుంది) అని వాజ్‌పేయికి నచ్చజెప్పారు. బాలాసాహెబ్ తన చివరి శ్వాస వరకు మోదీ స్నేహాన్ని గౌరవించారు, కానీ మోదీ మాత్రం బాలాసాహెబ్‌ని మోసం చేశారని’’ సావంత్ అన్నారు. ప్రధాని కేబినెట్లో భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌కు కేంద్ర మంత్రిగా పనిచేసిన సావంత్, 2019లో సేన-బీజేపీ పొత్తు ముగిసిన తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. చదవండి: Maharashtra: వారం గడిచినా అదే ఉద్రిక్తత.. షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు ముంబై వస్తే? -
నా ఆశయానికి మీ ఆశీస్సులు కావాలి
-
కరోనా వార్డులో సేవలందిస్తోన్న నటి
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాం అన్నమాట తరచూ వింటూనే ఉంటాం. కానీ ఈసారి ఓ యువ నటి పనిగట్టుకుని మరీ నర్స్ అవతారం ఎత్తింది. కోవిడ్-19తో ఫైట్ చేస్తున్న వైద్యులకు తనవంతు సాయం అందించేందుకు ముందుకొచ్చిన ఆవిడే శిఖ మల్హోత్రా. ప్రస్తుతం ఆమె ముంబైలో బాలాసాహెబ్ ఠాక్రే ట్రామా సెంటర్లో ఆసుపత్రిలో నర్సుగా సేవలందిస్తోంది. కరోనా పేషెంట్లకు తనవంతు సాయం అందించేందుకు నర్సుగా మారానని ఆమె చెప్పుకొచ్చింది. "దేశానికి సేవ చేయడానికి నేనెప్పుడూ ముందుంటాను. అది నటిగా కానీ, నర్సుగా కానీ, ఏదైనా కావచ్చు. నా ఆశయానికి మీ ఆశీస్సులు కావాలి. దయచేసి అందరూ ఇంటిపట్టునే ఉండండి. జాగ్రత్త వహించండి, ప్రభుత్వానికి మద్దతివ్వండి" అని పేర్కొంది. గృహ నిర్బంధాన్ని పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఆమె గతంలో ఢిల్లీలోని వర్ధమాన్ మహవీర్ మెడికల్ కళాశాల, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో నర్సింగ్ నేర్చుకుంది. కాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కేసుల సంఖ్య భారత్‌లో 1000కి పైగా నమోదయ్యాయి. ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌లో మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల్లో సేవలంలదిస్తున్న నర్సులకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాక వైద్యారోగ్య సిబ్బందికి రూ.20 లక్షల మేర ఇన్సూరెన్స్ పాలసీ అందించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. (కరోనా విరాళం) -
33,000 రుద్రాక్షలతో బాల్ థాకరే చిత్రపటం
సాక్షి, ముంబై : శివసేన వ్యవస్ధాపకులు బాలాసాహెబ్ థాకరే 93వ జయంతోత్సవాల సందర్భంగా ఆర్టిస్ట్ చేతన్ రౌత్ 33,000 రుద్రాక్షలతో థాకరే ప్రత్యేక చిత్రపటం రూపొందించారు. బాలాసాహెబ్ థాకరేకు రుద్రాక్షలతో ప్రత్యేక అనుబంధం ఉండటంతో వాటితోనే ఆయన చిత్రపటం రూపొందించానని రౌత్ చెప్పారు. 8 అడుగుల ఎత్తు 8 అడుగుల వెడల్పుతో 33,000 రుద్రాక్షలతో దీన్ని తయారుచేశానని..దీన్ని ప్రపంచ రికార్డుగా మలిచేందుకు ప్రయత్నించానని వెల్లడించారు. థాకరే జయంతోత్సవాలకు అంకితం చేస్తూ ఈ చిత్రపటాన్ని ముంబైలోని శివసేన భవన్ ఎదురుగా అమర్చారు. కాగా దివంగత థాకరే స్మృతి చిహ్నం నిర్మాణానికి రూ 100 కోట్లు కేటాయించాలని మహారాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. గతంలో ముంబై మేయర్ బంగ్లా ఉన్న శివాజీ పార్క్ ఏరియాలో థాకరే మెమోరియల్ నిర్మించనున్నారు. మెమోరియల్ నిర్మాణం కోసం సముద్రానికి అభిముఖంగా ఉన్న 11,500 చదరపు మీటర్ల స్ధలాన్ని ఇప్పటికే బాలాసాహెబ్ థాకరే రాష్ర్టీయ స్మారక్ న్యాస్ (ట్రస్టు)కు కేటాయించారు. -
అమితాబ్..అరడజను శత్రువులు
అమితాబ్ బచ్చన్ హీరోగా ‘సర్కార్’, ‘సర్కార్ రాజ్’ తీసిన రామ్‌గోపాల్ వర్మ ఆ సినిమాలకు కొనసాగింపుగా తెరకెక్కిస్తున్న మూడో చిత్రం ‘సర్కార్ 3’. తనకెంతో ఇష్టమైన హాలీవుడ్ చిత్రం ‘గాడ్ ఫాదర్’ స్ఫూర్తితో ‘సర్కార్’ ఫ్రాంచైజీలో చిత్రాలను తెరకెక్కిస్తున్నారు వర్మ. అమితాబ్ నటించిన సుభాష్ నాగరే పాత్రను శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాకరే తరహాలో ప్రజెంట్ చేశారు. మూడో చిత్రంలోనూ ఆయన సుభాష్ నాగరేగా కనిపించనున్నారు. ఇక అమితాబ్ కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్యా రాయ్‌లు ‘సర్కార్ 3’లో నటించడం లేదని వర్మ స్పష్టం చేశారు. ఈ చిత్రంలో ముఖ్యమైన నటీనటుల ఫస్ట్ లుక్స్‌ను వర్మ విడుదల చేశారు. ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ ఇందులో మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. చిత్రంలో ఆయన్ను అందరూ ‘సర్’ అని సంభోదిస్తారట. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో వెంకటేశ్, మహేశ్‌బాబులకు నానమ్మగా నటించిన రోహిణీ హట్టంగడి ఈ చిత్రంలో రక్కుబై దేవిగా విలనిజం చూపించనున్నారు. గోరక్ రాంపూర్గా రెండు పార్శ్వాలున్న పాత్రలో భరత్ దభోల్కర్... తన తండ్రి చావుకి కారణమైన సుభాష్ నాగరేపై ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూసే పాత్రలో హీరోయిన్ యామీ గౌతమ్.. సుభాష్ నాగరే అనుచరుడిగా రోనిత్ రాయ్ నటిస్తున్నారని వర్మ తెలిపారు. అత్యంత క్రూరుడైన శివాజీ అలియాస్ చీకు పాత్రలో యువ నటుడు అమిత్ సాద్ కనిపించనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరహా పాత్రను మనోజ్ బాజ్‌పాయ్ చేయనున్నారు. ‘‘కాకపోతే.. ఇది కాస్త వయొలెంట్ వెర్షన్’’ అన్నారు వర్మ. ‘‘మనోజ్ అద్భుతమైన నటుడే కానీ అరవింద్ కేజ్రీవాల్ కంటే నటనలో చాలా చిన్నోడు’’ అని వర్మ వ్యాఖ్యానించడం కొసమెరుపు. రోనిత్ రాయ్ మినహా వర్మ పరిచయం చేసిన మిగతా ఆరు పాత్రలూ ప్రతినాయక ఛాయలున్నవి కావడం గమనార్హం. సో.. ఇందులో అమితాబ్‌కు మొత్తం అరడజను మంది విలన్లు ఉంటారన్నమాట. -
అమ్మ నిర్మాత.. కొడుకు దర్శకుడు
ముంబై: శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత బాల్ ఠాక్రే జీవితకథను వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఈ సినిమాకు ‘సాహెబ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాకు బాల్ ఠాక్రే కోడలు స్మితా ఠాక్రే నిర్మాత కాగా, ఆయన మనవడు, స్మిత కొడుకు రాహుల్ దర్శకుడు కావడం విశేషం. బాల్ ఠాక్రే జీవితకథ ఆధారంగా తీస్తున్న ఈ సినిమాకు తన కొడుకు రాహుల్ దర్శకత్వం వహించడం తనకు సంతోషంగా ఉందని స్మిత చెప్పారు. ‘బాలాసాహెబ్ ఎప్పుడూ లెజండ్లా బతికారు. కుటుంబానికి, అనుచరులకు ఆయన ఓ ప్రశ్నలాంటి వారు. ఆయన జీవిత ప్రయాణంలో ఓ భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాం. సాహెబ్ జీవితకథను తెరకెక్కించే బాధ్యతను ఆయన మనవడు రాహుల్ తీసుకున్నాడు’ అని స్మిత తెలిపారు. వచ్చే అక్టోబర్‌లో ఈ సినిమా ప్రారంభంకానుంది. నటీనటులను ఇంకా ఎంపిక చేయాల్సివుంది.