రెండో రోజు కాస్త పెరిగిన కలెక్షన్లు
తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన అకీరా సినిమా కలెక్షన్లు రెండో రోజు కొంచెం పెరిగాయి. అకీరా విడుదలైన తొలిరోజు శుక్రవారం 5.15 కోట్ల రూపాయల వసూళ్లు రాగా, శనివారం 5.30 కోట్ల రూపాయలు వచ్చాయి. ఈ సినిమా తొలి రెండు రోజుల్లో కలిపి మొత్తం 10.45 కోట్లు రూపాయలు రాబట్టింది. ఆదివారంతో పాటు సోమవారం వినాయకచవితి పండగ సెలవు కావడంతో మరో రెండు రోజులు ఇదే తరహాలో కలెక్షన్లు రావచ్చని అంచనా వేస్తున్నారు.
మురుగదాస్ బాలీవుడ్లో గజని, హాలిడే వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీశాడు. అయితే ఆయన తాజా చిత్రం అకీరాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఈ భారీ యాక్షన్ డ్రామా సినిమాను దాదాపు 30 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. అకీరాలో సోనాక్షి ప్రధాన పాత్ర పోషించగా, అనురాగ్ కశ్యప్, కొంకనా సేన్ శర్మ ఇతర పాత్రల్లో నటించారు.