నిరాశపరిచిన తొలిరోజు కలెక్షన్లు | Sonakshi Sinha's film gets off to an underwhelming start | Sakshi
Sakshi News home page

నిరాశపరిచిన తొలిరోజు కలెక్షన్లు

Published Sat, Sep 3 2016 3:38 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

నిరాశపరిచిన తొలిరోజు కలెక్షన్లు

నిరాశపరిచిన తొలిరోజు కలెక్షన్లు

తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన అకీరా సినిమాకు తొలిరోజు బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. మురుగదాస్ బాలీవుడ్లో గజని, హాలిడే వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీశాడు. అయితే ఆయన తాజా చిత్రం అకీరాకు మిశ్రమ స్పందన వచ్చింది.

అకీరా విడుదలైన తొలిరోజు శుక్రవారం 5.15 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్టు బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ వెల్లడించాడు. తొలిరెండు షోలకు కలెక్షన్లు తక్కువగా రాగా, సాయంత్రానికి కాస్త పుంజుకున్నాయని ఆదర్శ్ ట్వీట్ చేశాడు. కాగా వినాయకచవితి పండగ రావడంతో లాంగ్ వీకెండ్ కారణంగా సోమవారం నాటికి కలెక్షన్లు పెరగవచ్చని భావిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ డ్రామా సినిమాను దాదాపు 30 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. అకీరాలో సోనాక్షి ప్రధాన పాత్ర పోషించగా, అనురాగ్ కశ్యప్, కొంకనా సేన్ శర్మ ఇతర పాత్రల్లో నటించారు. మురుగదాస్ మహిళ ప్రధాన పాత్రగా సినిమా తీయడం ఇదే తొలిసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement