స్పైడర్‌పై ఎవరేమన్నారంటే... | Spyder Movie Twitter Review | Sakshi
Sakshi News home page

స్పైడర్‌పై ఎవరేమన్నారంటే...

Published Wed, Sep 27 2017 8:48 AM | Last Updated on Sat, Aug 25 2018 6:37 PM

Spyder Movie Twitter Review - Sakshi

సాక్షి, సినిమా : టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటించిన స్పైడర్‌ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే యూఎస్‌ ప్రీమియర్‌ షోలు, ఇక్కడ ఎర్లీ మార్నింగ్‌ షోలు పడిపోయాయి. స్టార్‌ దర్శకుడు మురుగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌ కెరీర్‌లోనే హయ్యెస్ట్‌ బడ్జెట్‌ చిత్రంగా స్పైడర్‌ తెరకెక్కింది. దీంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మహేష్‌, సూర్య యాక్టింగ్‌ బాగుందని, అయితే నటనలో సూర్యకే ఎక్కువ మార్కులు వేయొచ్చని సినిమా చూసిన వారు అంటున్నారు. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌తో హ్యారిస్‌ జైరాజ్‌ ఆకట్టుకున్నాడని, కెమెరా పనితనం అద్భుతంగా ఉందని పొగుడుతున్నారు. అయితే తమిళ ప్రేక్షకులకు మాత్రం సినిమా బాగా కనెక్ట్‌ అయినట్లు చెబుతున్నారు. మురుగదాస్‌ మహేష్‌కు మరో బ్లాక్‌ బస్టర్‌ అందించారని అంటున్నారు. యూనిక్‌ సబ్జెక్ట్‌తో హీరోయిజం పెద్దగా ఎలివేట్‌ చేయకుండానే సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడడని కితాబిస్తున్నారు.

అయితే మరికొందరు మాత్రం సినిమాపై నెగటివ్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఊహించిన రేంజ్‌ లో లేదని, ముఖ్యంగా సెకండాఫ్‌ మురుగదాస్‌ దారుణంగా తెరకెక్కించాడని సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఓ సీరియల్‌ కిల్లర్‌కు.. ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌కు మధ్య జరిగే కథను చాలా సాదాసీదాగా తీశాడంటూ పెదవి విరుస్తున్నారు. మురుగదాస్‌ మార్క్‌ మెసేజ్‌ అనేది లేకుండా పేలవమమైన సినిమాను అభిమానులకు అందించారని మరికొందరు చెబుతున్నారు. మరికొందరేమో సినిమాలో అరవ వాసనలు ఎక్కువయ్యాయని.. నాలుగు సీన్లు తప్ప, మిగతా కథంతా చాలా నార్మల్‌గా ఉందని అంటున్నారు. ముఖ్యంగా గ్రాఫిక్స్‌ వర్క్‌ ఎక్కువగా ఉన్నా రెండు సీన్లు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయని చెబుతున్నారు.

గమనిక.. ఇది దారిన పోయే దానయ్యలు చెబుతున్న మాటలు కావు.. సినిమా చూసిన ప్రేక్షకులే చేసిన ట్వీట్లు... 


పూర్తి రివ్యూ కోసం చూస్తుండండి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement