
జల్సా చేద్దాం!
‘‘టైటిల్‌కి తగ్గట్టుగానే ఇందులో నాది జల్సారాయుడిలాంటి పాత్ర. ప్రతిక్షణం జల్సా చేద్దానుకునే మనస్తత్వం నాది. దర్శకుడు చెప్పిన కథ నాకు విపరీతంగా నచ్చింది. కథాకథనాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి’’ అని శ్రీకాంత్ చెప్పారు. శ్రీకాంత్, ఎస్తేర్, ప్రాచి సిన్హా కాంబినేషన్‌లో సీహెచ్ సుధీర్ రాజు దర్శకత్వంలో కొలన్ వెంకటేశ్ నిర్మిస్తోన్న ‘జల్సారాయుడు’ చిత్రం ఇటీవలే తొలి షెడ్యూలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘అక్టోబర్ మొదటివారంలో రెండో షెడ్యూలు మొదలుపెడతాం. ఇందులో శ్రీకాంత్ పాత్ర చాలా కొత్తగా, కలర్‌ఫుల్‌గా, జోష్‌గా ఉంటుంది’’ అని తెలిపారు. ఇందులో ప్రతి ఫ్రేమ్ కలర్‌ఫుల్‌గా ఉంటుందని, చక్రి సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: విక్రమ్‌రాజ్, కెమెరా: కె. బుజ్జి.