ఎడిన్బర్గ్ వర్సిటీలో హీరో ఉపన్యాసం
జీవితమే ఓ పాఠం.. దానిని తెలుసుకుంటూపోవడం ఓ అద్భుతమంటున్నాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. ఆయన గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) బ్రిటన్లోని ప్రఖ్యాత ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో ఉపన్యాసం ఇవ్వబోతున్నారు. దీని గురించి షారుఖ్ ట్విట్టర్లో స్పందిస్తూ.. 'జీవిత పాఠాల గురించి నేను ఈ రోజు ఉపన్యసించబోతున్నాను. జీవితం గురించి తెలుసుకోవడం అద్భుతం' అని పేర్కొన్నాడు. బ్లాక్ అండ్ వైట్లోని ఓ ఫొటో కూడా పోస్టు చేశాడు.
షారుఖ్ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆయన నటించిన 'దిల్వాలే దుల్హన్ లేజాయెంగే', 'కుచ్ కుచ్ హోతా హై', 'జబ్ తక్ హై జాన్' సినిమాలు ప్రపంచవ్యాప్తంగా కాసులు కురిపించాయి. 49 ఏండ్ల షారుఖ్ ప్రస్తుతం 'దిల్వాలే', 'రాయిస్', 'ఫ్యాన్' సినిమాల్లో నటిస్తున్నాడు.