
సునీల్, మనీషా రాజ్ జంటగా ఎన్. శంకర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘2 కంట్రీస్’. మలయాళ సూపర్ హిట్ సినిమా ‘2 కంట్రీస్’ సినిమాకి రీమేక్‌గా రూపొందింది. ఈ సినిమాని ఈ నెలాఖరులోనే చూడొచ్చు. 29న విడుదల కానుంది. ఎన్.శంకర్ మాట్లాడుతూ– ‘‘మలయాళంలో సూపర్‌హిట్ అవడంతో పాటు రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిన ‘2 కంట్రీస్‘ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడం సంతోషంగా ఉంది. సునీల్‌కి సరిగ్గా సరిపోయే పాత్ర ఇది. ఈ చిత్రంలో సరికొత్త సునీల్‌ను చూస్తారు.
సినిమా చాలా బాగా వచ్చింది. అధిక శాతం అమెరికాలో చిత్రీకరించాం. షూటింగ్, డబ్బింగ్‌తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. ‘ఎన్‌కౌంటర్‘ అనంతరం మళ్లీ ఈ సినిమా కోసం ఒక పాట రాశా. నా గత చిత్రాలు ‘జయం మనదేరా, జై బోలో తెలంగాణ , శ్రీరాములయ్య, భద్రాచలం’లను ఆదరించిన ప్రేక్షకులకు ‘2 కంట్రీస్‘ తప్పకుండా నచ్చుతుంది. పవన్ కల్యాణ్ విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్, సంగీతం: గోపీసుందర్.
Comments
Please login to add a commentAdd a comment