ముంబై: జంతు సంరక్షణ కోసం బాలీవుడ్ నటి సన్నీలియోన్ భర్త డెనియల్ వెబర్‌తో కలిసి నగ్న ప్రదర్శన చేసింది. జంతు సంరక్షణ సంస్థ ‘పెటా’ (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్)కు ప్రచారకర్తైన సన్నీ జంతువుల సంరక్షణ ప్రచారంలో భాగంగా ఈ నగ్న ఫొటోలకు ఫోజుచ్చింది. జంతువులను చంపి వాటి చర్మంతో తయారు చేసిన దుస్తులు ధరించరాదనే సందేశాన్ని ఈ నగ్నత్వంలోనే గ్రహించాలని ఆమె అభిమానులను కోరింది.
ఈ ఫొటోను పెటా ఇండియా అధికారిక ట్విట్టర్‌లో ‘ జంతు సంరక్షణ ప్రచారంలో భాగంగా స్టన్నింగ్ బ్యూటీ సన్నీ, ఆమె భర్త డెనియల్ వెబర్ ఫొటో షూట్ అని ట్వీట్ చేసింది. అంతేగాకుండా జంతువుల చర్మలతో దుస్తులు ఎలా తయారుచేస్తున్నారనే వీడియోను సైతం పెటా షేర్ చేసింది.
జంతు చర్మంతో కాకుండా తయారు చేసిన వస్తువులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వస్తువులనే ఎంచుకోండి అని సన్నీ అభిమానులకు పిలుపునిచ్చింది. మేం జంతువుల పక్షాన పోరాడుతున్నాం. వాటి సంరక్షణ కోసం పాటుపడుతున్నామని సన్నీ భర్త డెనియల్ తెలిపాడు.
Stunning beauty @SunnyLeone and her husband @DanielWeber99 in new PETA campaign promote animal-free fashion. https://t.co/egUvr9xaHF
— PETA India (@PetaIndia) 28 November 2017
Thanks @subisamuel for this beautiful shot.
Thanks @hitendra1480 for styling & #TomasMoucka for hair & make-up. pic.twitter.com/polWc6EGQB
Comments
Please login to add a commentAdd a comment