వంద లీటర్ల పాలతో స్నానం! | sunny leone is taking a bath with 100 liter milk | Sakshi
Sakshi News home page

వంద లీటర్ల పాలతో స్నానం!

Published Sat, Feb 7 2015 11:45 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

వంద లీటర్ల  పాలతో స్నానం! - Sakshi

వంద లీటర్ల పాలతో స్నానం!

హాట్ గాళ్ సన్నీ లియోన్ అంటే పడి చచ్చిపోయే కుర్రకారు చాలామంది ఉన్నారు. సన్నీ కటౌట్లకు పాలాభిషేకం చేసేంత వీరాభిమానులు కూడా ఉన్నారు. సన్నీ ఇప్పటివరకూ కనిపించనంత హాట్‌గా ‘ఏక్ పహేలీ లీలా’లో కనిపించి, ఆ అభిమానులను మరింతగా అలరించనున్నారు. ఈ చిత్రంలో ఆమె పాలతో స్నానం చేసే సన్నివేశం ఒకటుంది. పాల టబ్బులో సన్నీ హొయలు పోతూ స్నానం చేసే ఆ సీన్ చాలా రసవత్తరంగా ఉంటుందని బాలీవుడ్ టాక్. కేవలం ఈ ఒక్క సన్నివేశం కోసమే వంద లీటర్ల పాలు వాడారట. గ్లాసుడు పాలు పిల్లలకు పట్టలేని దీనస్థితిలో ఉన్నవారి కడుపు మండించే వార్త ఇది. కానీ, శృంగారప్రియులకు మాత్రం చల్లని వార్తే అని చెప్పాలి. బాబీఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సన్నీ టైటిల్ రోల్ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement