ek paheli leela
-
సల్మాన్‌లా పుట్టాలని ఉంది!
‘‘నాకు గాడ్ ఫాదర్లు ఇష్టం ఉండరు. నా సినిమాలకు సంబంధించిన నిర్ణయాలు నేనే తీసుకుంటా. నా కెరీర్ నా ఇష్టం. ఎవరి జోక్యం సహించలేను. కానీ నాకు ఏ సందేహం వచ్చినా కేవలం నా భర్త డేనియల్ వెబెర్తో చర్చిస్తా ’’ అంటున్నారు శృంగార తార సన్నీ లియోన్. ప్రస్తుతం ఆమె నటించిన ‘ఏక్ పహేలీ లీలా’ విడుదలకు సిద్ధంగా ఉంది. పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి బాబీఖాన్ దర్శకుడు. మీరు మళ్లీ జన్మలో ఎలా పుట్టాలనుకుంటున్నారని సన్నీని అడిగితే, ‘‘నాకు సల్మాన్‌లా పుట్టాలని ఉంది. ఎందుకంటే ఆయన అంటే చాలా మంది భయపడతారు. అలానే ఆయనను ప్రేమిస్తారు కూడా. చాలా మంచి వ్యక్తి’’ అని సల్మాన్‌ను పొగడ్తలతో ముంచెత్తారామె. మరి ఈ మాటలు సల్మాన్ చెవిన పడ్డాయో లేదో....! -
జస్ట్ ట్రైలర్..
హాట్‌భామ సన్నీలియోన్ ఏం చేసినా హాట్ టాపికే. ఆ అమ్మడు నటిస్తున్న తాజా చిత్రం ‘ఏక్ పహేలీ లీలా’ చిత్రం ట్రైలర్ గత నెల 6న విడుదలైంది. అది మొదలు యూ ట్యూబ్‌లో హిట్ల మీద హిట్లు సొంతం చేసుకుంటోంది. షారుఖ్ దేవదాసులో ఐశ్వర్య ఆడిన ‘మన్ డోలారే..’ పాట ఇందులోనూ ఉంది. ఆ సాంగ్‌కు సన్నీ వేసిన స్టెప్స్ ఈ ట్రైలర్లో ఉన్నాయట. ఇంకేముంది నెటిజన్లు విరగబడి మరీ ఈ ట్రైలర్ చూస్తున్నారు. ఇప్పటికే కోటీ ఇరవై లక్షల వ్యూస్ సంపాదించుకుంది. ఈ రేంజ్లో రెస్పాన్స్ చూసి.. సన్నీయా మజాకా అంటున్నారు ఇండస్ట్రీ జనం. -
కోటిమంది చూసిన ట్రైలర్
విదేశాల నుంచి మన సినిమాల్లోకి దిగివచ్చిన శృంగార తార సన్నీ లియోన్ అభిమానుల్ని ఈ మధ్య ఎవరిని కదిలించినా, అందరూ ‘ఏక్ పహెలీ లీలా’ సినిమా గురించే మాట్లాడుతున్నారు. ఆ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, వేడెక్కించే నృత్యగీతం ఇప్పటికే ‘యూ’ ట్యూబ్‌లో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా విడుదలైన ఆ చిత్రంలోని ఒక శృంగార గీతం వాటన్నిటినీ మించి ఇప్పుడు సంచలనం రేపుతోంది. ‘తేరే బిన్ నహీ (లాగే...’ అనే ఈ పాటలో సన్నీ ఏకంగా ఆ చిత్రంలోని ముగ్గురు హీరోల (జయ్ భానుశాలి, రజనీశ్ దుగ్గల్, రాహుల్‌దేవ్)తో ప్రణయం సాగిస్తూ కనిపిస్తున్నారు. సాంప్రదాయికమైన సల్వార్ సూట్లలో కనిపిస్తూనే, అందరినీ అకర్షిస్తున్నారు. దాదాపు 300 ఏళ్ళ కాలం పాటు విస్తరించిన కథ అయిన ఈ మ్యూజికల్ థ్రిల్లర్ సినిమాలో సన్నీ ఒక యువరాణిగా, గ్రామీణ యువతిగా, ఆధునిక మహిళగా మూడు అవతారాల్లో కనిపిస్తారు. పునర్జన్మ నేపథ్యంలో సాగే ఈ సస్పెన్స్ డ్రామాకు సంబంధించిన ట్రైలర్‌ను ‘యూ’ ట్యూబ్‌లో చూసినవారి సంఖ్య ఇప్పటికే కోటి దాటింది. ఇక, ఈ తాజా శృంగార గీతాన్నయితే నెట్లోకి వచ్చిన ఒక్క రోజు లోపలే లక్ష మందికి పైగా చూశారు. బాబీ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. -
వంద లీటర్ల పాలతో స్నానం!
హాట్ గాళ్ సన్నీ లియోన్ అంటే పడి చచ్చిపోయే కుర్రకారు చాలామంది ఉన్నారు. సన్నీ కటౌట్లకు పాలాభిషేకం చేసేంత వీరాభిమానులు కూడా ఉన్నారు. సన్నీ ఇప్పటివరకూ కనిపించనంత హాట్‌గా ‘ఏక్ పహేలీ లీలా’లో కనిపించి, ఆ అభిమానులను మరింతగా అలరించనున్నారు. ఈ చిత్రంలో ఆమె పాలతో స్నానం చేసే సన్నివేశం ఒకటుంది. పాల టబ్బులో సన్నీ హొయలు పోతూ స్నానం చేసే ఆ సీన్ చాలా రసవత్తరంగా ఉంటుందని బాలీవుడ్ టాక్. కేవలం ఈ ఒక్క సన్నివేశం కోసమే వంద లీటర్ల పాలు వాడారట. గ్లాసుడు పాలు పిల్లలకు పట్టలేని దీనస్థితిలో ఉన్నవారి కడుపు మండించే వార్త ఇది. కానీ, శృంగారప్రియులకు మాత్రం చల్లని వార్తే అని చెప్పాలి. బాబీఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సన్నీ టైటిల్ రోల్ చేస్తున్నారు. -
లీలా కావడం చాలా కష్టమైంది: సన్నీ లియోన్
బాబీఖాన్ తీస్తున్న 'ఏక్ పహేలీ లీలా' సినిమాలో వేర్వేరు అవతారాలు పోషిస్తున్న సన్నీలియోన్.. చాలా కష్టపడుతోంది. తనకు అందులో లీలా పాత్ర పోషించడం, ఆ పాత్రలోకి వెళ్లిపోవడం చాలా కష్టం అవుతోందని తెలిపింది. సినిమా ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమంలో ఆమె పాల్గొంది. ఇది చాలా ఛాలెంజింగ్ పాత్ర అని, స్క్రిప్టు చూడగానే అది తనకు బాగా నచ్చిందని చెప్పింది. అయితే.. లీలాగా మారడానికి మాత్రం తనకు కనీసం 2-3 గంటల సమయం పడుతోందని తెలిపింది. తొలిరోజు అయితే.. తన లుక్ పూర్తిగా నిర్ణయించుకోడానికి 6 గంటల సమయం పట్టిందని చెప్పింది. అయితే, తన టీంలో చాలామంది నుంచి కావల్సినంత మద్దతు లభించిందని, లీలా పాత్రకు డైలాగులు చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది అయ్యిందని సన్నీ అంటోంది. చాలా కష్టపడి అవన్నీ నేర్చుకున్నానని, అది ప్రేక్షకులకు బాగా ఎక్కుతుందని అంటోంది. ఈ సినిమాలో జయ్ భానుశాలి, రజనీష్ దుగ్గల్, రాహుల్ దేవ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కానుంది.