కోటిమంది చూసిన ట్రైలర్ | Sexy Sunny Leones Leela trailer crosses 1 crore whiching | Sakshi
Sakshi News home page

కోటిమంది చూసిన ట్రైలర్

Published Sat, Feb 28 2015 10:48 PM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM

కోటిమంది చూసిన ట్రైలర్

కోటిమంది చూసిన ట్రైలర్

విదేశాల నుంచి మన సినిమాల్లోకి దిగివచ్చిన శృంగార తార సన్నీ లియోన్ అభిమానుల్ని ఈ మధ్య ఎవరిని కదిలించినా, అందరూ ‘ఏక్ పహెలీ లీలా’ సినిమా గురించే మాట్లాడుతున్నారు. ఆ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, వేడెక్కించే నృత్యగీతం ఇప్పటికే ‘యూ’ ట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా విడుదలైన ఆ చిత్రంలోని ఒక శృంగార గీతం వాటన్నిటినీ మించి ఇప్పుడు సంచలనం రేపుతోంది. ‘తేరే బిన్ నహీ (లాగే...’ అనే ఈ పాటలో సన్నీ ఏకంగా ఆ చిత్రంలోని ముగ్గురు హీరోల (జయ్ భానుశాలి, రజనీశ్ దుగ్గల్, రాహుల్‌దేవ్)తో ప్రణయం సాగిస్తూ కనిపిస్తున్నారు. సాంప్రదాయికమైన సల్వార్ సూట్లలో కనిపిస్తూనే, అందరినీ అకర్షిస్తున్నారు.
 
 దాదాపు 300 ఏళ్ళ కాలం పాటు విస్తరించిన కథ అయిన ఈ మ్యూజికల్ థ్రిల్లర్ సినిమాలో సన్నీ ఒక యువరాణిగా, గ్రామీణ యువతిగా, ఆధునిక మహిళగా మూడు అవతారాల్లో కనిపిస్తారు. పునర్జన్మ నేపథ్యంలో సాగే ఈ సస్పెన్స్ డ్రామాకు సంబంధించిన ట్రైలర్‌ను ‘యూ’ ట్యూబ్‌లో చూసినవారి సంఖ్య ఇప్పటికే కోటి దాటింది. ఇక, ఈ తాజా శృంగార గీతాన్నయితే నెట్‌లోకి వచ్చిన ఒక్క రోజు లోపలే లక్ష మందికి పైగా చూశారు. బాబీ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement