సల్మాన్‌లా పుట్టాలని ఉంది! | I would like to be reborn as Salman Khan: Sunny Leone | Sakshi
Sakshi News home page

సల్మాన్‌లా పుట్టాలని ఉంది!

Published Wed, Apr 1 2015 10:10 PM | Last Updated on Sat, Sep 2 2017 11:42 PM

సల్మాన్‌లా పుట్టాలని ఉంది!

సల్మాన్‌లా పుట్టాలని ఉంది!

‘‘నాకు గాడ్ ఫాదర్‌లు ఇష్టం ఉండరు. నా సినిమాలకు సంబంధించిన నిర్ణయాలు నేనే తీసుకుంటా. నా కెరీర్ నా ఇష్టం. ఎవరి జోక్యం సహించలేను. కానీ నాకు ఏ సందేహం వచ్చినా కేవలం నా భర్త డేనియల్ వెబెర్‌తో చర్చిస్తా ’’ అంటున్నారు శృంగార తార సన్నీ లియోన్. ప్రస్తుతం ఆమె నటించిన ‘ఏక్ పహేలీ లీలా’ విడుదలకు సిద్ధంగా ఉంది. పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి బాబీఖాన్ దర్శకుడు. మీరు మళ్లీ జన్మలో ఎలా పుట్టాలనుకుంటున్నారని సన్నీని అడిగితే, ‘‘నాకు సల్మాన్‌లా పుట్టాలని ఉంది. ఎందుకంటే ఆయన అంటే చాలా మంది భయపడతారు. అలానే ఆయనను ప్రేమిస్తారు కూడా. చాలా మంచి వ్యక్తి’’ అని సల్మాన్‌ను పొగడ్తలతో ముంచెత్తారామె. మరి ఈ మాటలు సల్మాన్ చెవిన పడ్డాయో లేదో....!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement