ప్రధాని మోదీ, సల్మాన్‌ కంటే సన్నీ లియోన్‌ టాప్‌! | Sunny Leone becomes the most searched personality of 2016 | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ, సల్మాన్‌ కంటే సన్నీ లియోన్‌ టాప్‌!

Published Fri, Dec 2 2016 2:24 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

ప్రధాని మోదీ, సల్మాన్‌ కంటే సన్నీ లియోన్‌ టాప్‌! - Sakshi

ప్రధాని మోదీ, సల్మాన్‌ కంటే సన్నీ లియోన్‌ టాప్‌!

మాజీ పోర్న్‌ స్టార్‌ సన్నీ లియోన్‌కు భారత్‌లో ఉన్నంత క్రేజు అంతా ఇంతా కాదు. ఈ ఏడాది మన దేశంలో నెటిజెన్లు.. ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ల కంటే ఎక్కువగా సన్నీ లియోన్‌ కోసం సెర్చ్‌ చేశారట. ఈ విషయంలో సన్నీ.. మోదీ, సల్మాన్‌ల కంటే టాప్‌లో నిలిచింది. ఆమె వరుసగా ఐదో ఏడాది మోస్ట్‌ సెర్చ్‌డ్‌ పర్సనాలిటీగా నిలవడం గమనార్హం. యాహూ ఇండియా ఈ విషయాన్ని వెల్లడించింది.

2016లో మోస్ట్‌ సెర్చ్‌డ్‌ మేల్‌ సెలెబ్రిటీ జాబితాలో మాత్రం సల్మాన్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా టీవీ స్టార్‌ కపిల్‌ శర్మ, బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌ ఉన్నారు. కాగా ప్రధాని మోదీ ఎన్నో స్థానంలో ఉన్నారన్న విషయం తెలియరాలేదు. ఇక మహిళల జాబితాలో సన్నీ లియోన్‌ తర్వాత బాలీవుడ్‌ హీరోయిన్లు బిపాసా బసు, దీపికా పదుకోన్‌, కత్రినా కైఫ్‌ ఉన్నారు.  ఓవరాల్‌గా సన్నీ లియోన్‌లో టాప్‌లో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement