most searched personality
-
Virat Kohli: రాజు ఎక్కడైనా రాజే! టాప్‌లో కింగ్ కోహ్లి
రన్‌మెషీన్, రికార్డుల రారాజు.. టీమిండియా సూపర్‌స్టార్... విరాట్ కోహ్లి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అద్భుత ఆట తీరుతో ఆధునిక క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతున్న మకుటం లేని మహారాజు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న ఈ ఢిల్లీ బ్యాటర్.. గూగుల్ 25 ఏళ్ల చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. నెట్ ప్రపంచంలో అతిపెద్ద సెర్చ్ ఇంజన్ అయిన గూగుల్‌లో అత్యధికసార్లు సెర్చ్ చేయబడిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. టాప్‌లో కింగ్ కోహ్లి ఈ విషయాన్ని గూగుల్ అధికారికంగా వెల్లడించింది. తన 25 ఏళ్ల ప్రయాణానికి సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. ఇక అత్యధిక మంది వెదికిన క్రికెటర్ల జాబితాలో కోహ్లి అగ్రస్థానంలో నిలవగా.. అత్యధికసార్లు సెర్చ్ చేయబడిన అథ్లెట్‌గా పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో నిలిచాడు. అథ్లెట్ల జాబితాలో రొనాల్డో అదే విధంగా మోస్ట్ సెర్చెడ్ స్పోర్ట్ జాబితాలో ఫుట్‌బాల్ టాప్ ర్యాంకు సొంతం చేసుకుంది. కాగా 35 ఏళ్ల విరాట్ కోహ్లి ఇప్పటికే క్రికెట్లో ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. సొంతగడ్డపై వరల్డ్‌కప్-2023 సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట వన్డేల్లో ఉన్న సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు. యాభై ఓవర్ల క్రికెట్లో అత్యధిక సెంచరీ(50)లు చేసిన బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. సోషల్ మీడియాలోనూ హవా ఇదిలా ఉంటే... సోషల్ మీడియాలోనూ విరాట్ కోహ్లి తన హవా కొనసాగిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా అతడు 265 మిలియన్ ఫాలోవర్లు కలిగి ఉన్నాడు. ఫుట్‌బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ తర్వాత అత్యధిక అనుచర గణం కలిగిన ఆటగాడిగా కోహ్లి కొనసాగుతున్నాడు. చదవండి: ఒకవేళ అదే జరిగితే రోహిత్ టాప్ కెప్టెన్ అవుతాడు! పెద్దన్నలపైనే భారం.. If the last 25 years have taught us anything, the next 25 will change everything. Here’s to the most searched moments of all time. #YearInSearch pic.twitter.com/MdrXC4ILtr — Google (@Google) December 11, 2023 -
టాప్‌లో సుశాంత్.. బన్నీని వెనక్కినెట్టిన సోనూసూద్!
సినిమాలో విలన్ పాత్రలు పోషించే నటుడు సోనూసూద్ లాక్డౌన్లో రియల్ హీరోగా మారారు. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్లో ఇబ్బంది పడిన ఎంతో మందికి సాయం అందించి అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. లాక్డౌన్లో ప్రారంభమైన సోనూసూద్ చేస్తున్న సేవలు నేటికి కొనసాగుతున్నాయి. బాలీవుడ్ నటుడైన సోనూసూద్ తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా సుపరిచితుడే. సూపర్‌తో టాలీవుడ్‌కు పరిచయమైన సోనూసూద్ జులాయి, అతడు, ఆగడు, అరుంధతి, శక్తి, సీత వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. తాజాగా సెర్చ్ ఇంజన్ దిగ్గజం యాహూలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ప్రముఖుల్లో సోనూసూద్‌కు స్థానం లభించింది. చదవండి: సుశాంత్ కేసు: రియా సోదరుడికి బెయిల్ యాహూ 2020 లో అత్యధికంగా శోధించిన ప్రముఖుల జాబితాను విడుదల చేసింది. ఇందులో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దేశ వ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచాడు. అతని తర్వాత రెండవ స్థానంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మూడో స్థానంలో నటుడు అక్షయ్ కుమార్ నిలిచారు. కాగా తొలిసారి ఈ జాబితాలోకి సోనూసూద్ ఎంటర్ అయ్యారు. గూగుల్‌లో ఎక్కువ మంది శోధించిన వారిలో సోనూసూద్ ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నారు. గతేడాది ఈ స్థానాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దక్కించుకోగా. ప్రస్తుతం బన్నీ పదో స్థానానికి పడిపోయారు. యాహూ జాబితాలో టాప్ 10లో టాలీవుడ్ హీరోల నుంచి అల్లు అర్జున్ ఒక్కరే చోటు దక్కించుకున్నారు. వీరితో పాటు అక్షయ్ కుమార్, సల్మాన్, ఇర్ఫాన్ ఖాన్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి వారు సైతం ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. చదవండి: బన్నీకి విజయ్ దేవరకొండ సర్ప్రైజ్.. థ్యాంక్స్ బ్రదర్ టాప్ 10 మంది వరుసగా.. 1. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2. అమితాబ్ బచ్చన్ 3. అక్షయ్ కుమార్ 4. సల్మాన్ ఖాన్ 5. దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ 6. దివంగత నటుడు రిషి కపూర్ 7. దివంగత గాయకుడు బాల సుబ్రహ్మణ్యం 8. సోనూసూద్ 9. అనురాగ్ కశ్యప్ 10. అల్లు అర్జున్ కాగా ఈ జాబితాలో మహిళా ప్రముఖుల విభాగంలో బాలీవుడ్ నటి రియా చక్రవర్తి అగ్రస్థానంలో నిలిచారు. నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదురవ్వడంతో రియా నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. ఇటీవల కంగనా మహారాష్ట్ర ప్రభుత్వంపై, సుశాంత్ మరణంతోపాటు పలువురిపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆమెను హాట్ టాపిక్‌గా మార్చింది. ఇక వరుసగా టాప్ 10 జాబితాను చూసుకుంటే.. 1 రియా చక్రవర్తి 2 కంగనా రనౌత్ 3 దీపికా పదుకొనె 4 సన్నీ లియోన్ 5 ప్రియాంక చోప్రా 6 కత్రినా కైఫ్ 7 నేహా కక్కర్ 8 కనికా కపూర్ 9 కరీనా కపూర్ 10 సారా అలీ ఖాన్ -
ప్రధాని మోదీ, సల్మాన్ కంటే సన్నీ లియోన్ టాప్!
-
ప్రధాని మోదీ, సల్మాన్ కంటే సన్నీ లియోన్ టాప్!
మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్‌కు భారత్‌లో ఉన్నంత క్రేజు అంతా ఇంతా కాదు. ఈ ఏడాది మన దేశంలో నెటిజెన్లు.. ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ల కంటే ఎక్కువగా సన్నీ లియోన్ కోసం సెర్చ్ చేశారట. ఈ విషయంలో సన్నీ.. మోదీ, సల్మాన్ల కంటే టాప్‌లో నిలిచింది. ఆమె వరుసగా ఐదో ఏడాది మోస్ట్ సెర్చ్డ్ పర్సనాలిటీగా నిలవడం గమనార్హం. యాహూ ఇండియా ఈ విషయాన్ని వెల్లడించింది. 2016లో మోస్ట్ సెర్చ్డ్ మేల్ సెలెబ్రిటీ జాబితాలో మాత్రం సల్మాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా టీవీ స్టార్ కపిల్ శర్మ, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్ ఉన్నారు. కాగా ప్రధాని మోదీ ఎన్నో స్థానంలో ఉన్నారన్న విషయం తెలియరాలేదు. ఇక మహిళల జాబితాలో సన్నీ లియోన్ తర్వాత బాలీవుడ్ హీరోయిన్లు బిపాసా బసు, దీపికా పదుకోన్, కత్రినా కైఫ్ ఉన్నారు. ఓవరాల్‌గా సన్నీ లియోన్‌లో టాప్‌లో నిలిచింది.