‘ఆర్‌ఎక్స్‌ 100’ హీరో ఫైర్‌..! | Supari Movie Producer Allegations On Rx100 Hero Karthikeya | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 4 2018 12:24 PM | Last Updated on Tue, Sep 4 2018 4:53 PM

Supari Movie Producer Allegations On Rx100 Hero Karthikeya - Sakshi

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో హీరో కార్తికేయ ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో ప్రస్తుతం కార్తికేయతో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు ఇంట్రస్ట్‌ చూపిస్తున్నారు. ఇప్పటికే ఓ బైలింగ్యువల్ సినిమాకు ఓకె చెప్పిన కార్తికేయ ఆ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా కార్తికేయ నటించిన మరో సినిమా రిలీజ్‌ అవుతుందంటూ వార్తలు వచ్చాయి.

సుపారి పేరుతో తెరకెక్కిన సినిమాలో కార్తికేయ నటించాడన్నదే ఆ వార్తల సారాంశం. అంతేకాదు సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల లిస్ట్‌తో పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. సినిమాకు కార్తికేయ పాత్ర హైలెట్‌ అంటూ ప్రకటించారు చిత్రయూనిట్‌. అయితే హీరో కార్తికేయ వెర్షన్‌ మరోలా ఉంది. అసలు తాను ఆ సినిమాలో నటించలేదంటున్నాడు కార్తికేయ.

‘ఆ వీడియో లో ఉన్నది నేనే. కానీ నేను ఆ సినిమాలో నటించలేదు. కేవలం డెమో రీల్ అని షూట్ చేసి దాన్ని సినిమాకి వాడుకున్నారు. షూటింగ్ త్వరలో స్టార్‌ చేస్తామన్నారు కానీ చేయలేదు. నేను సుపారి సినిమాలో నటించలేదు’ అంటూ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఇక ఈ నాన్‌సెన్స్‌ ఆపాలంటూ సుపారి చిత్రయూనిట్‌ను కోరారు. అయితే సుపారి నిర్మాతలు మాత్రం కార్తికేయ ఆర్‌ఎక్స్‌ 100 సక్సెస్‌ తరువాత మొహం చాటేశాడంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement