సూపర్‌స్టార్‌తో ‘ఆస్కార్’ | Superstar 'Oscar' | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్‌తో ‘ఆస్కార్’

Published Sat, Mar 14 2015 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM

సూపర్‌స్టార్‌తో ‘ఆస్కార్’

సూపర్‌స్టార్‌తో ‘ఆస్కార్’

తమిళసినిమా: ఎట్టకేలకు సూపర్‌స్టార్‌తో చిత్రం చేసే అవకాశం ఆస్కార్ ఫిలింస్ చేజిక్కించుకుంది. విశ్వనాయకుడితో ఓ దశావతారం, విజయకాంత్ హీరోగా వానతై పోలా, రమణ, విక్రమ్ కథానాయకుడిగా అన్నియన్, తాజా చిత్రం ఐ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఆస్కార్ ఫిలింస్. విజయ్, అజిత్, సూర్య లాంటి యువస్టార్ హీరోలతోనూ చిత్రాలు తీసిన ఈ సంస్థ ఒక్క రజనీకాంత్‌తో ఇప్పటి వరకు చిత్రం చేయలేదు. ఆ కొరత ఇప్పుడు తీరబోతోందన్నది తాజా వార్త. నిజం చెప్పాలంటే రజనీకాంత్ ఇటీవల నటించిన కోచ్చడయాన్, లింగా రెండు చిత్రాలు నిరాశపరిచాయి.

ఇలాంటి తరుణంలో సూపర్‌స్టార్ తదుపరి చిత్రం ఏమిటన్నది చాలామందిని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. ఇలాంటి పరిస్థితిలో శంకర్ దర్శకత్వంలో ఎందిరన్-2 చేస్తారని, పి.వాసు కథ వినిపించారని, బాషా ఫేమ్ సురేష్‌కృష్ణ కూడా లైన్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే తాజా రజనీకాంత్‌ను ఆస్కార్ ఫిలింస్ సంస్థలో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం చేయడానికి సిద్ధం అవుతున్నారన్నది అనధికార నిర్ధారణ.

ఆస్కార్ ఫిలింస్‌లో రజనీకాంత్ నటించడం దాదాపు ఖరారైనట్లే. ఈ అంశంపై ఆస్కార్ రవిచంద్రన్ ఇటీవల రజనీకాంత్‌ను కలిశారు. అయితే ఈ చిత్రం విషయం చర్చల్లో ఉందని ఆయన చెప్పడం విశేషం. ఆస్కార్ ఫిలింస్‌లో ఏఆర్ మురుగదాస్ ఇంతకుముందు రమణ వంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం.  రవిచంద్రన్ ఈ సారి సూపర్‌స్టార్‌తో ఎలాంటి అద్భుతాన్ని సృష్టించనున్నారో చూడాల్సిందే. చిత్రం ఏడాది చివర్లో తెరపైకి రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement