
హాస్యనటుడు ‘షకలక’ శంకర్ హీరోగా ఎస్.కె. పిక్చర్స్ సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘శంభో శంకర’. ఈ సినిమా నిర్మాతల్లో ఒక్కరైన సురేశ్ కొండేటి తాజాగా శంకర్ హీరోగా మరో సినిమా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. రెండున్నర దశాబ్దాల క్రితం జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన సురేశ్ ‘సంతోషం’ పత్రికాధినేతగా, నిర్మాతగా ఎదిగారు. ఈ రోజు (శనివారం) సురేశ్ కొండేటి పుట్టినరోజు సందర్భంగా రెండు సినిమాలను ప్రకటించారు.
ఆయన మాట్లాడుతూ– ‘‘శంకర్ హీరోగా నిర్మించనున్న సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ప్రీ–ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. ‘శంభో శంకర’ సినిమాకు దీటుగా అన్ని కమర్షియల్ హంగులతో ఈ చిత్రం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రసుత్త రాజకీయాల నేపథ్యంలోనూ ఓ సినిమాకి శ్రీకారం చుట్టబోతున్నాం. ఇంతవరకూ వచ్చిన పొలిటికల్ మూవీస్‌కు భిన్నంగా ఉత్తేజభరితంగా, స్ఫూర్తిదాయకంగా మా సినిమా ఉండబోతోంది. కథా చర్చలు తుది దశకు చేరుకున్నాయి. అతి త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియచేస్తాం’’ అని రెండు చిత్రాల ప్లానింగ్ గురించి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment