పట్నా: బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్‌పుత్ సింగ్ అస్థికలను కుటుంబ సభ్యులు గురువారం గంగలో నిమజ్జనం చేశారు. తండ్రి కేకే సింగ్, సోదరి శ్వేత సింగ్ కృతి ఇతర కుటుంబ సభ్యులు అతడికి అంతిమ వీడ్కోలు పలుకుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ విషయాన్ని సుశాంత్ సోదరి శ్వేత సింగ్ కీర్తి ఫేస్‌బుక్ వేదికగా గురువారం వెల్లడించారు. తన తమ్ముడి కోసం ఎవరూ బాధ పడొద్దని మరోసారి విజ్ఞప్తి చేశారు. సుశాంత్ ఎల్లప్పుడూ అభిమానుల హృదయాల్లో సజీవంగానే ఉంటాడని.. తనకు సంతోషకరమైన వీడ్కోలు పలకాలని ఉద్వేగానికి గురయ్యారు. తన జ్ఞాపకాలతో ముందుకు సాగుతూ.. సుశాంత్‌పై మనకున్న అపరిమితమైన ప్రేమను చాటుకోవాలన్నారు. కాగా స్వస్థలం పట్నాలోని ఇంట్లో సుశాంత్ పెద్దకర్మ నిర్వహించనున్నట్లు సమాచారం. (మామూ వెళ్లిపోయాడు.. లేదు బతికే ఉన్నాడు!)
ఇదిలా ఉండగా.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటనపై ముంబై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ స్నేహితులు, బంధువులు, ఇంట్లో పనిచేసే వాళ్లను విచారించి వారి నుంచి వాంగూల్మాన్ని రికార్డు చేశారు. ఈ క్రమంలో సుశాంత్ ప్రేమికురాలిగా ప్రచారంలో ఉన్న నటి చక్రవర్తిని పోలీసులు గురువారం విచారించారు. బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఆమెను విచారించి వాంగూల్మాన్ని నమోదు చేశారు. కాగా ఆదివారం ముంబైలోని తన నివాసంలో సుశాంత్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. మానసిక ఒత్తిడి కారణంగానే అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడని ప్రాథమిక విచారణలో తేలినా.. వృత్తిపరంగా సుశాంత్‌తో శత్రుత్వం కలిగి ఉన్న వారు అతడిని ఆత్మహత్యకు ప్రేరేపించారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.(సుశాంత్ ఆత్మహత్య: ప్రముఖులపై కేసు)
Comments
Please login to add a commentAdd a comment