విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని తాడేపల్లిగూడెం, ఎస్వీఆర్ సర్కిల్‌లో ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కెయన్ రోడ్‌లో ఆదివారం ఉదయం విగ్రహష్కరణకు ముహూర్తం ఫిక్స్ చేశారు. మెగాస్టార్‌చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరవుతారని, ఆయన చేతులమీదుగానే విగ్రహావిష్కరణ జరుగుతుందని అధికారికంగా ప్రకటించారు.
అయితే చివరి నిమిషంలో ఈ కార్యక్రమం వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. కారణాలు వెల్లడించకపోయినా విగ్రహావిష్కణ వాయిదా పడిందని, త్వరలోనే మరో తేదిని ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. విగ్రహావిష్కరణకు పూర్తి స్థాయిలో అనుమతులు రాకపోవడం కారణంగానే కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment