స్వీటీ అని పిలిస్తే స్పందిస్తా!
మనిషి జీవితం మహా సముద్రంలోని అలలలాంటిది. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుందని కొందరు అంటుంటారు గానీ, నిజానికి విధి రాతను ఎవరూ మార్చలేరు. అయితే అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. ఇలా ఎదిగిన వారిలో నటి అనుష్క ఒకరు. గత ఒక అనుభవం. దాన్ని తలచుకుంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఎక్కిన మెట్లు మధురాను భూతినిస్తాయి. ఒకప్పటి యోగా టీచర్ ఇప్పుడు మేటి బహుభాషానటి. ఎలాంటి పాత్రనైనా అవలీలగా నటించి మెప్పించగల నాయకి.
అందాలు ఆరబోసి యువతను గిలిగింతలు పెట్టగలరు. కత్తి పట్టి అరివీర భయంకరంగా పోరు భూమిలో వీరవిహారం చేయగలరు. జేజెమ్మ లాంటి పాత్రల్లో ప్రేక్షకుల చేత జేజేలు కొట్టించుకోగలరు. సైజ్ జీరో చిత్రంలో బొద్దుగానూ స్వీటీ అనిపించుకోగలరు. 36 ఏళ్ల వయసులోనూ 16 ఏళ్ల పరువాల పడతిలా నిగనిగలాడుతున్న అనుష్క తన గతాన్ని ఒక్క సారి తిరగేసుకుంటే. ఆ సంగతులేమిటో ఆమె మాటల్లోనే చూద్దాం.నేను యోగాలో శిక్షణ పొంది హైదరాబాద్‌లో క్లాసులు నిర్వహిస్తున్నాను.అలాంటి సమయంలో నటిగా అవకాశం వచ్చింది.
టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జునకు జంటగా సూపర్ చిత్రంలో నటించే అవకాశాన్ని దర్శకుడు పూరిజగన్నాథ్ కల్పించారు.అప్పటి వరకూ నాకు నటనలో ఓనమాలు తెలియవు. అంతే కాదు సుమారు ఏడాది వరకూ సినిమారంగంలో ఇమడలేక పోయాను. నటనపై ప్రత్కేక దృ ష్టి కూడా పెట్టలేక పోయాను. నటులతో కలిసి నటించేటప్పుడు చాలా సిగ్గు పడేదాన్ని. అంతే కాదు అది తలచుకుని ఎన్నో రాత్రులు బాధపడ్డాను. చాలాసార్లు ఏడ్చేశాను కూడా. అలా మనసు వద్దు అంటున్నా ప్రయత్నం, పట్టుదలతో నటనపై పట్టు సాధించాను.
ఆరంభంలో నన్ను గుర్తు పట్టడానికి చేతిలో పాస్‌పోర్టు ఫొటో మినహా ఏమీ లేదు. ఆ తరువాత ఫొటో సెషన్ చేశారు. మీకో విషయం చెప్పాలి. నా అసలు పేరు అనుష్క కాదు. అది సినిమ కోసం పెట్టిందే. అసలు పేరు స్వీటీ.నా పాస్‌పోర్టు, చదువుకున్న సరిఫికెట్స్‌లో స్వీటీ అనే ఉంటుంది. మరో విషయం ఏమిటంటే మొదట్లో అనుష్క అని ఐదారు సార్లు పిలిస్తేగానీ తిరిగి చూసేదాన్ని కాదు.అదే స్వీటీ అని పిలిస్తే వెంటనే స్పందించేదాన్ని అని తన గతాన్ని గుర్తు చేసుకున్నారు అనుష్క.