క్రేజ్ వస్తుందని భయపడుతుందట..! | taapsi on her movies | Sakshi
Sakshi News home page

క్రేజ్ వస్తుందని భయపడుతుందట..!

Published Thu, Jun 16 2016 1:11 PM | Last Updated on Mon, Aug 13 2018 3:04 PM

క్రేజ్ వస్తుందని భయపడుతుందట..! - Sakshi

క్రేజ్ వస్తుందని భయపడుతుందట..!

కెరీర్ స్టార్టింగ్లో సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూసిని ఢిల్లీ భామ తాప్సీ, ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉంది. సౌత్లో చేసిన కాంచన 2 సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ, బేబి సినిమాతో బాలీవుడ్లోనూ మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తరువాత తాప్సీ చేసిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోయినా త్వరలో క్రేజీ ఆఫర్స్తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతోంది.

ప్రస్తుతం అమితాబ్ బచ్చన్తో కలిసి పింక్, నానాపటేకర్తో కలిసి తడ్కా సినిమాల్లో నటిస్తోంది తాప్సీ. ఒకేసారి ఇద్దరు లెజెండరీ యాక్టర్స్తో కలిసి నటిస్తుండటంతో ఆ సినిమాల రిలీజ్ తరువాత తనకు భారీ క్రేజ్ వస్తుందని భావిస్తోంది ఈ బ్యూటి. ఈవిషయాన్ని స్వయంగా చిత్ర ప్రమోషన్ ఈవెంట్లో మీడియాతో పంచుకున్న తాప్సీ. నాకు భారీ క్రేజ్ వస్తుందేమో అని భయంగా ఉందంటూ కామెంట్ చేసింది. సౌత్ లోనూ ఘాజీ లాంటి ఆసక్తికర సినిమాల్లో నటిస్తూ తన ఫాం కొనసాగించే పనిలో ఉంది ఈ బ్యూటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement