
కన్నడంలో పవర్‌స్టార్‌తో?
తమన్నా అందచందాలను, అభినయాన్ని ఇప్పటివరకూ తెలుగు, తమిళ, హిందీ భాషలవారు మాత్రమే చూశారు. ఈ ఏడాది కన్నడ ప్రేక్షకులను కూడా ఆమె కనువిందు చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం తెలుగులో ఆగడు, బాహుబలి, హిందీలో ఇట్స్ ఎంటర్‌టైర్‌మెంట్, హమ్ షకల్స్, నో ఎంట్రీ మై ఎంట్రీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న తమన్నాకి ఇటీవల కన్నడం నుంచి ఆఫర్ వచ్చింది. కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హీరోగా పవన్ వడియార్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఇందులోనే తమన్నాని నాయికగా అడిగారట. ‘రాణా విక్రమార్క’ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని వినికిడి. మరి.. ఈ సినిమాకి తమన్నా పచ్చజెండా ఊపారా? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.