రణవీర్, అమితాబ్లతో తమన్నా
ఒకప్పుడు అవకాశాల కోసం ఎదురుచూసిన మిల్కీ బ్యూటి తమన్నా ఇప్పుడు వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. బాహుబలి, ఊపిరి సినిమాల సక్సెస్తో సూపర్ ఫాంలోకి వచ్చిన ఈ బ్యూటి, బాలీవుడ్లోనూ సత్తా చాటుతోంది. ఇప్పటికే బాలీవుడ్ ఊపిరి రీమేక్కు ఓకె చెప్పేసిన తమ్మూ, ఇప్పుడు హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిన ట్రైలర్తో హల్ చల్ చేస్తోంది.
రణవీర్ చింగ్ రిటర్న్స్ పేరుతో రూపొందిన ఓ బాలీవుడ్ ట్రైలర్ ఇప్పుడు మీడియా సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. హాలీవుడ్ మూవీ మ్యాడ్ మ్యాక్స్ తరహాలో రూపొందిన ఈ ట్రైలర్లో రణవీర్ సింగ్, అమితాబ్ బచ్చన్లు డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్న ఈ యాడ్లో తమన్నా తన గ్లామర్తో ఆకట్టుకుంటోంది. భారీగా రూపొందిన ఈ ట్రైలర్లో దర్శకుడు రోహిత్ శెట్టి అంటూ టైటిల్స్లో పడింది.
అసలు ఎనౌన్స్మెంట్ కూడా లేకుండా ఇంత త్వరగా రోహిట్ శెట్టి సినిమా ఎప్పుడు తీశాడా అని అనుకుంటున్నారా..? అదేం లేదండి. చింగ్స్ సీక్రెట్ అనే చైనీస్ బ్రాండ్ తయారు చేసే ఫాస్ట్ ఫుడ్ కంపెనీ వారు తమ ప్రాడక్ట్ను ఇండియాలో లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఇంత భారీ యాడ్తో మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు. కేవలం యాడ్ మాత్రమే కాదు. రణవీర్ దీపికలపై ఓ కలర్ ఫుల్ సాంగ్ కూడా రిలీజ్ చేయనున్నారట.