సూర్యను పెళ్లాడాలని ఉంది : నటి | Tamil Actress Yashika Said She Want To Marry Surya | Sakshi
Sakshi News home page

మండిపడుతున్న అభిమానులు

Published Tue, Jan 22 2019 9:14 AM | Last Updated on Tue, Jan 22 2019 10:53 AM

Tamil Actress Yashika Said She Want To Marry Surya - Sakshi

కొందరు హీరోయిన్లు కావాలనే సమస్యలను కొని తెచ్చుకుంటారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఫ్రీ ప్రచారం పొందాలని ప్రయత్నించి ఇరకాటంలో పడుతుంటారు. వర్ధమాన నటి యాషికా పరిస్థితీ ఇదే. ‘ఇరుట్టు అరైయిల్‌ మురట్టు కుత్తు’ చిత్రంలో అశ్లీల సన్నివేశాల్లో నటించి పాపులర్‌ అయిన ఈ అమ్మడు ఇటీవల బిగ్‌బాస్‌–2 గేమ్‌ షోలో పాల్గొని అక్కడ జుగుప్సాకరమైన దుస్తులు ధరించి విమర్శలకు గురైంది. నటుడు మహత్‌తో ప్రేమ కలాపాలు అంటూ మరోసారి రచ్చకు దారి తీసింది. మొత్తం మీద అలా పాపులారిటీ సంపాదించుకున్న యాషికా ఇప్పుడు పలు సినీ అవకాశాలను అందుకుంటోంది.

ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈ అమ్మడు రూపాయి నోటుపై ఆటోగ్రాఫ్‌ చేసి వివాదాల్లో చిక్కుకుంది. అది సద్దుమణగక ముందే తాజాగా నటుడు సూర్య అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది. ఈ సంచలన నటి అభిమానుల ప్రశ్నలకు తన ట్విట్టర్‌ ద్వారా బదులిచ్చింది. అందులో ఒక అభిమాని మీకు నటుడు సూర్య అంటే ఇష్టమా అని అడగ్గా అందుకు సూర్య ఫొటోను పోస్ట్‌ చేసి, ఆయన్ని పెళ్లాడాలని ఆశపడుతున్నట్లు పేర్కొని మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. యాషికా వ్యాఖ్యలపై సూర్య అభిమానులు మండిపడుతున్నారు. అటు నటి జ్యోతిక అభిమానులు కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

‘నటుడు సూర్యకు పెళ్లి అయిన విషయం యాషికాకు తెలియదా’, ‘సూర్య, జ్యోతిక దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్న విషయం తెలిసి సూర్యను పెళ్లాడాలని ఎలా అంటుంది’ అంటూ యాషికాపై మాటల దాడి చేస్తున్నారు. ఏదో ఆశిస్తే, ఇంకేదో జరిగిందంటే ఇదేనేమో.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement