తెలుగు బిగ్‌బాస్‌పై పిటిషన్‌: హైకోర్టు విచారణ | Telangana High Court Hearing On Petition Against Bigg Boss | Sakshi
Sakshi News home page

తెలుగు బిగ్‌బాస్‌పై పిటిషన్‌: హైకోర్టు విచారణ

Published Mon, Jul 22 2019 1:30 PM | Last Updated on Mon, Jul 22 2019 3:31 PM

Telangana High Court Hearing On Petition Against Bigg Boss - Sakshi

 సాక్షి, హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ 3 తెలుగు రియాలిటీ షోపై దాఖలైన వ్యాజ్యాన్ని తెలంగాణ హైకోర్టు సోమవారం విచారించింది. బ్రాడ్‌కాస్టింగ్ నిబంధనలకు విరుద్ధంగా బిగ్‌బాస్ షో ప్రసారమవుతోందని, సినిమాలను  ఎలాగైతే సెన్సార్ చేస్తారో.. అదేవిధంగా ఈ టీవీ షోను కూడా సెన్సార్‌ చేసి.. ప్రసారం చేయాలని నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌ షో ద్వారా పిల్లలను, యువతను చెడుమార్గంలోకి తీసుకెళ్లే అవకాశముందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్స్‌ ఎంపిక సందర్భంగా మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని, కాబట్టి బిగ్‌బాస్ షోను వెంటనే నిలిపేయాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ షో హోస్ట్ నాగార్జున, స్టార్ మా చానెల్‌, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం కామర్స్, జిల్లా కలెక్టర్, డీజీపీ, హైదరాబాద్ సీపీ, తదితరులను తన పిటిషన్‌లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. సోమవారం ఈ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement