బెంగళూర్ డేస్... | telugu heros Summer vacation at Bangalore | Sakshi
Sakshi News home page

బెంగళూర్ డేస్...

Published Fri, May 22 2015 11:40 PM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM

బెంగళూర్ డేస్...

బెంగళూర్ డేస్...

ఎండలు మండిపోతున్నాయి. ఈ హీట్ నుంచి తప్పించుకోవడానికి స్టార్స్ అంతా ఇప్పుడు శీతల ప్రదేశాల వైపు చూస్తున్నారు. ఊటీ, కొడెకైనాల్ లాంటి సమ్మర్ రిసార్ట్స్ సరేసరి! పార్టీ చేసుకొని, రొటీన్ నుంచి సేద తీరడానికీ, కుటుంబంతో కాలక్షేపం చేయడానికీ ‘దేశీ లాస్‌వేగాస్’ అని ముద్దుగా చెప్పుకొనే బెంగళూరుకు ఛలో అంటున్నారు. వారంగా హీరో అల్లు అర్జున్ కుటుంబం బెంగళూరులో సేద తీరుతున్నట్లు భోగట్టా. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తరువాత కాస్తంత బ్రేక్ తీసుకోవాలనుకున్న అల్లు వారి అబ్బాయి కుటుంబంతో సహా అక్కడకు వెళ్ళారు.

ఫ్యామిలీ ఫామ్‌హౌస్‌లో కాకుండా, బెంగళూరు శివార్లలో ఉంటున్నారు. అల్లు అర్జున్ సోదరుడు - నటుడు అల్లు శిరీష్ కూడా వేసవి వేడికి తట్టుకోలేక ఈ గార్డెన్ సిటీకి వెళ్ళారు. నాగచైతన్య కూడా ఇప్పుడు కర్నాటక రాజధానిలోనే ఉన్నారు. కాకపోతే, ఆయన షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ‘ఏమాయ చేసావె’తో తనకు తొలి హిట్ ఇచ్చిన తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్‌తో కలసి చేస్తున్న తాజా తెలుగు - తమిళ ద్విభాషా చిత్రం పనిలో ఉన్నారు. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను బెంగళూరులో చిత్రీకరిస్తున్నారు.

హెదరాబాద్ హీట్ నుంచి తప్పించుకోగలుగుతున్నారు. చిరంజీవి లాగే ఆయన కుమారుడు రామ్‌చరణ్ కూడా సినిమాల మధ్య గ్యాప్‌లో హ్యాపీగా గడిపేయడానికి బెంగళూరుకు వెళుతుంటారు. షూటింగ్ కోసం ప్రస్తుతం యూరప్‌కు వెళ్ళిన రామ్‌చరణ్ కొద్దివారాల ముందు కూడా బెంగళూరులో గడిపారు. హైదరాబాద్ ఎండలకు బెంబేలెత్తి, దగ్గరలో హిల్ రిసార్ట్స్ ఏవైనా ఉంటే ఎంత బాగుండని ట్వీట్ చేసిన రానా దగ్గుబాటి ఓటు కూడా బెంగళూరుకే! తమిళ హీరోలు సిద్ధార్థ్, శింబు కూడా ఈ ఉద్యాన నగరిలో కాలక్షేపం చేస్తుంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement