డీటీహెచ్‌లో మిణుగురులు | Telugu movie to see simultaneous release on DTH and theatres | Sakshi
Sakshi News home page

డీటీహెచ్‌లో మిణుగురులు

Published Thu, Jan 23 2014 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM

Telugu movie to see simultaneous release on DTH and theatres

ఒక సినిమా థియేటర్లలో విడుదలైన రోజునే బుల్లితెరపై కూడా విడుదలైతే...? ఇంటిల్లిపాదీ ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని చూసేయొచ్చు. ‘మిణుగురులు’ చిత్రం ఆ అవకాశాన్నే కల్పించబోతోంది. ఆశిష్ విద్యార్థి, సుహాసిని ముఖ్య తారలుగా అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి రూపొందించిన ఈ చిత్రం ఈరోజు విడుదలవుతోంది. బుల్లితెరకు ఎయిర్‌టెల్ వారు డీటీహెచ్ (డెరైక్ట్ టు హోమ్) విధానం ద్వారా విడుదల చేస్తున్నారు. హాస్టల్‌లో నివసించే అంధ బాల, బాలికల జీవితం చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని దర్శకుడు తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బాలల చలన చిత్రోత్సవాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారని, ఇంకా ఆరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు ఈ సినిమా ఎంపికైందని, డీటీహెచ్ ద్వారా విడుదలవున్న తొలి సినిమా ఇదేనని అయోధ్యకుమార్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement