వేసవి సినిమాల జోరు
నాగ్, కార్తీల 'ఊపిరి'తో మొదలైన వేసవి సినిమాల జోరు ఊపందుకుంది. ఉగాదికి పవర్ స్టార్ 'సర్దార్ గబ్బర్ సింగ్' థియేటర్లలోకి రాగా మరిన్ని సినిమాలు క్యూలో ఉన్నాయి. ఈ శుక్రవారం మంచు విష్ణు, రాజ్ తరుణ్ల ఎంటర్టెయినర్ 'ఈడో రకం ఆడో రకం' రిలీజ్ కానుంది. ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బోయపాటి శ్రీనుల సరికొత్త కలయికలో ఊర మాస్ సినిమా 'సరైనోడు' ఏప్రిల్ 22 వ తేదీన అభిమానులను అలరించనుంది. ఇక అదే రోజున నాగ చైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ప్రేక్షకులను పలకరించనుంది.
వీటితోపాటు తమిళ్ డబ్బింగ్ సినిమా పోలీసోడు, మరికొన్ని లో బడ్జెట్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక సాయి ధరమ్ తేజ్ 'సుప్రీం' ఆడియో ఏప్రిల్ 14న విడుదల కానుండగా.. ఇటీవలే పోస్టర్తో అంచనాలు పెంచేసిన మహేష్ 'బ్రహ్మోత్సవం' ఆడియో మే 1వ తేదీన రిలీజ్ చేయనున్నారు. పరీక్షలు కూడా ముగిసిపోయి కాలేజీలకు సెలవులు ఇవ్వడంతో థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. వేసవి సినిమాలు సందడి చేస్తున్నాయి.