లవ్ బెల్స్ | The Bells Telugu Song Celebration movie | Sakshi
Sakshi News home page

లవ్ బెల్స్

Published Thu, Feb 26 2015 11:33 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

లవ్  బెల్స్ - Sakshi

లవ్ బెల్స్

 ప్రణయం, వినోదం, సందేశం కలగలిసిన సినిమా ఇదని నిర్మాత వెంకటాచారి చెప్పారు. ప్రవీణ్‌చందర్ దర్శకత్వంలో రాహుల్, నేహా దేశ్‌పాండే జంటగా ఆయన నిర్మించిన ‘ద బెల్స్’ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరి గింది. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ సలహాదారు ఆర్. విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ -‘‘ఇలాంటి మంచి సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉంది. ప్రచార చిత్రాలు, పాటలు చాలా బాగున్నాయి’’ అన్నారు. ‘‘ఆడపిల్లనమ్మా నేను... ఆడపిల్లనోయి....’’ అనే ప్రైవేట్ సాంగ్‌తో పాపులరైన మధుప్రియ మీద చిత్రీకరించిన ‘అక్క నేనేమి సేతు’ పాట ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. వాణిజ్య చిత్రానికి కావాల్సిన హంగులన్నీ ఈ సినిమాలో ఉన్నాయి’’ అని దర్శకుడు తెలిపారు. ఈ వేడుకలో సంగీత దర్శకుడు కాసర్ల శ్యామ్, రచయిత శేఖర్ విఖ్యాత్,  ప్రముఖ దర్శకులు ఎన్. శంకర్, అల్లాణి శ్రీధర్, సానా యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement