Song Celebration
-
ప్రేమంటే... అంత ఈజీ కాదు
పవన్ కల్యాణ్ ‘ఖుషి’ చిత్రంలోని ‘ప్రేమంటే సులువు కాదురా..’ పాట ఎంత హిట్టో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే పేరుతో రూపొందుతున్న ప్రేమకథా చిత్రం ‘ప్రేమంటే సులువు కాదురా’. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి, సిమ్మిదాస్ జంటగా గోవింద్‌రెడ్డి దర్శకత్వంలో భవనాసి రాంప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. నందన్‌రాజ్ స్వరపరిచిన పాటలను సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి ఆవిష్కరించారు. రాజీవ్ మంచి విజయాలు సాధించి, పెద్ద హీరో కావాలని ఆయన ఆకాంక్షించారు. ‘‘ఇప్పటి వరకూ తెలుగులో వచ్చిన అత్యుత్తమ ప్రేమకథా చిత్రాల సరసన ఈ సినిమా నిలుస్తుంది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకూ సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అని నిర్మాత చెప్పారు. దర్శకుడు బి.గోపాల్, నిర్మాతలు ‘మధుర’ శ్రీధర్, బెక్కెం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
లవ్ బెల్స్
ప్రణయం, వినోదం, సందేశం కలగలిసిన సినిమా ఇదని నిర్మాత వెంకటాచారి చెప్పారు. ప్రవీణ్‌చందర్ దర్శకత్వంలో రాహుల్, నేహా దేశ్‌పాండే జంటగా ఆయన నిర్మించిన ‘ద బెల్స్’ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరి గింది. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ సలహాదారు ఆర్. విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ -‘‘ఇలాంటి మంచి సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉంది. ప్రచార చిత్రాలు, పాటలు చాలా బాగున్నాయి’’ అన్నారు. ‘‘ఆడపిల్లనమ్మా నేను... ఆడపిల్లనోయి....’’ అనే ప్రైవేట్ సాంగ్‌తో పాపులరైన మధుప్రియ మీద చిత్రీకరించిన ‘అక్క నేనేమి సేతు’ పాట ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. వాణిజ్య చిత్రానికి కావాల్సిన హంగులన్నీ ఈ సినిమాలో ఉన్నాయి’’ అని దర్శకుడు తెలిపారు. ఈ వేడుకలో సంగీత దర్శకుడు కాసర్ల శ్యామ్, రచయిత శేఖర్ విఖ్యాత్, ప్రముఖ దర్శకులు ఎన్. శంకర్, అల్లాణి శ్రీధర్, సానా యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.