జనానికి నచ్చింది! | The film's phenomenal challenge | Sakshi
Sakshi News home page

జనానికి నచ్చింది!

Published Sun, May 31 2015 1:14 AM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM

జనానికి నచ్చింది!

జనానికి నచ్చింది!

‘‘ఈ సినిమా నాకో సవాల్. ఎందుకంటే, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నన్ను నమ్మి ‘పండగ చేస్కో’ సినిమా కొన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనుకున్నా. అది నిజం చేసుకోగలిగాను. ఈ సినిమా కొన్నుకున్నవాళ్లందరూ హ్యాపీ’’ అని దర్శకుడు గోపీచంద్ మలినేని అన్నారు.
 
 ఆయన దర్శకత్వంలో రామ్, రకుల్ ప్రీత్‌సింగ్, సోనాల్ చౌహాన్ నాయకా నాయికలుగా పరుచూరి ప్రసాద్ నిర్మించిన ‘పండగ చేస్కో’ శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో విడుదలైన కొన్ని చిత్రాల్లోని పోలికలు ఈ చిత్రంలో కనిపించాయనే ప్రశ్నకు -‘‘ఇది ఫక్తు కమర్షియల్ సినిమా. జనానికి నచ్చే సినిమా అయితే సేఫ్ అనుకుని చేశాం.
 
 అందుకే సేఫ్ అయ్యాం’’ అన్నారు గోపీచంద్. తదుపరి ఓ స్టార్ హీరోతో సినిమా ఉందనీ, మురుగదాస్ అందించిన కథతో ఓ చిత్రం చేయనున్నాననీ తెలిపారు. ‘డాన్ శీను’ని హిందీలో అక్షయ్‌కుమార్ సంస్థతో కలిసి మురుగదాస్ నిర్మించాలనుకుంటున్నారనీ, దానికి ఎవరు దర్శకత్వం వహించాలనేది ఇంకా నిర్ణయించుకోలేదనీ గోపీచంద్ మలినేని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement