
అందులో నిజం లేదు
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ప్రేమా యణం అందరికీ తెలిసిందే. వీరిద్దరి మధ్య ఇలియానా చిచ్చుపెట్టిందనీ, విరాట్ కోహ్లీతో తాను చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోందని ఈ మధ్య ఓ గాసిప్ బాలీవుడ్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మొన్నటివరకూ ఇదే పెద్ద చర్చనీయాంశమైతే... ఇప్పుడు మరో గాలివార్త వినిపించింది. శ్రుతీ హాసన్, క్రికెటర్ సురేశ్ రైనా డేటింగ్ చేస్తున్నారని ఈ గాసిప్ సారాంశం. అయితే... ‘ఇందులో నిజం లేదు’ అని ఎట్టకేలకు సురేశ్ రైనా స్పందించారు. ‘నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు. నాపై వినిపిస్తున్న వార్తలో నిజం లేదు. ప్రస్తుతం నా దృష్టి మొత్తం నా క్రికెట్ కెరీర్ పైనే’’ అని తేల్చి చెప్పేశారు సురేశ్. అలాగే... ఈ విషయంపై శ్రుతిహాసన్ కూడా స్పందించారు. ‘‘ఈ గాసిప్‌లో నిజం లేదు’’ అని ప్రకటించిన శ్రుతి, ‘‘తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ, తీరిక లేకుండా ఉన్నాను. ఊపిరి పీల్చుకొనే తీరిక కూడా లేకుండా ఉంటే, ఇక ప్రేమవ్యవహారాలకు టైమెక్కడుంటుంది’’ అని ఎదురు ప్రశ్నించారు.