
ఒకేసారి ముగ్గురు!
ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్, సోనమ్‌కపూర్... ఒకరు ఎవర్‌గ్రీన్ బ్యూటీ అయితే, ఇంకొకరు అభిమానులకు డ్రీమ్‌గాళ్, మరొకరు హ్యపెనింగ్ హీరోయిన్. కేవలం వీళ్లు సినిమాల్లో ఉంటే వచ్చే అభిమానులు కోకొల్లలు. ఈ అందాల తారలు కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? సూపర్‌గా ఉంటుంది కదూ! ఇప్పుడదే జరుగు తోంది. అయితే ఇది వెండితెర మీద కాదు... కేవలం బుల్లితెర కోసమే. ఒక బహుళ జాతి సంస్థ యాడ్ కోసం టాప్ స్టార్స్ కలిసి నటించడం ఇదే మొదటిసారే. వెండితెరపై ఈ ముగ్గురూ కలిసి నటించే సంగతి మాటేమో కానీ, ఇప్పటికైతే బుల్లితెరపై అంతా కలిసి చేసిన ఈ యాడ్ కచ్చితంగా స్పెషలే కదూ!