sonamkapur
-
నీర్జా ప్రాఫిట్ హైజాక్!
లెక్క లెక్కే అప్పుడు విమానం హైజాక్ అయింది. ఇప్పుడు ప్రాఫిట్ హైజాక్ అయిందా? ఏమో! సిచ్యుయేషన్ చూస్తే అలాగే ఉంది. సినిమా వాళ్ల మాట నీటి మీద రాత అని నీర్జా బానోత్ కుటుంబానికి గ్రహింపుకొచ్చింది. ఇంతకీ విషయం ఏమిటి? ఎయిర్‌హోస్టెస్ నీరజా బానోత్... ఎప్పటి మాట? అవును, విమానం హైజాక్ ముప్పై ఏళ్ల కిందటి సంగతి. ప్రాఫిట్ హైజాక్ తాజా ఖబర్. అది 1986, సెప్టెంబర్ 5. పాన్ ఆమ్ 73 విమానం హైజాక్. బాంబే– కరాచీ– ఫ్రాంక్‌ఫర్ట్‌ల మీదుగా న్యూయార్క్‌కు ప్రయాణించాలి. పాకిస్థాన్ పోలీసుల వేషధారణలో ఉన్న లిబియా టెర్రరిస్టులు విమానాన్ని కరాచీలో దించారు. ఎయిర్‌హోస్టెస్ 22 ఏళ్ల నీర్జాబానోత్ ఉగ్రదాడి నుంచి ప్రయాణికులను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలర్పించింది. ఆమె సాహసానికి, సమయస్ఫూర్తికి, పరాక్రమానికి గాను భారత ప్రభుత్వం 1997లో అశోక చక్ర అవార్డు ప్రదానం చేసింది. ఇప్పుడేమయింది? నీర్జా బానోత్ బయోపిక్ తీయాలనే మంచి సంకల్పంతో 2015 మే నెలలో ఆమెను వార్తల్లోకి తెచ్చింది బాలీవుడ్. నీర్జా పాత్రధారి సోనమ్‌కపూర్, దర్శకుడు రామ్ మధ్వానీ, నిర్మాత అతుల్ కస్బేకర్తో సినిమా బృందం... నీర్జ సొంతూరు చండీఘర్ వెళ్లి... ఆమె అలవాట్ల నుంచి, ఇష్టాల వరకు ప్రతిదీ పూసగుచ్చినట్లు అధ్యయనం చేశారు. స్క్రిప్టుకి అంగీకారం కోరారు. నీర్జ తల్లిదండ్రులు భావోద్వేగంతో ఆమోదం తెలిపారు. ఆ ఎమోషన్లో నిర్మాత మరో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. అదేంటంటే... సినిమా విడుదలైన తర్వాత వచ్చిన లాభాల్లో పది శాతం నీర్జా బానోత్ కుటుంబానికి ఇస్తానన్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ నిర్మాత ఆ ఒప్పందాన్ని తప్పాడని నీర్జా సోదరుడు అనీష్ బానోత్ లీగల్ నోటీస్ పంపాడు. అదే ఇప్పుడు వార్త. ఒప్పందం ప్రకారం వారికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశానంటాడు నిర్మాత. బానోత్ లాయరు అనూష నాగరాజన్ మాత్రం... ‘‘ఇవ్వాల్సినంత ఇవ్వలేదు’’ అంటున్నారు. ఆ సినిమా నూటాపాతిక కోట్ల వ్యాపారం చేసింది. -
అవార్డు కొనలేదు
‘‘ఈ అవార్డును నేను నిజాయితీతో సంపాదించుకున్నాను. నేనిప్పటివరకూ మోసం చేయలేదు. అవార్డు కోసం ఎవరికైనా ఫోన్ చేయడం గాని, నాకు ఫేవర్ చేయమని డబ్బులు ఇవ్వడం గానీ చేయలేదు’’ అన్నారు హిందీ హీరో అక్షయ్ కుమార్. జాతీయ ఉత్తమ నటుడిగా అక్షయ్‌కు అవార్డు ఇవ్వడంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంతకు ముందు అవార్డు పట్ల అక్షయ్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘ఈ అవార్డును నా పేరెంట్స్, ఫ్యామిలీ, నా వైఫ్ (ట్వింకిల్ ఖన్నా)కు అంకితం చేస్తున్నాను. ‘మీరు అవార్డు ఫంక్షన్లకు వెళ్లడం మానేశారా? మీకెప్పుడైనా అవార్డు వస్తుందా?’ అని ట్వింకిల్ అన్నప్పుడు బాధగా అనిపించేది. ఇప్పుడు హ్యాపీ. అవార్డ్స్ కమిటీ జ్యూరీ, ఫ్యాన్స్, అందరికీ థ్యాంక్స్’’ అన్నారు అక్షయ్. అన్నట్టు... జాతీయ ఉత్తమ హిందీ చిత్రం ‘నీర్జా’లోని నటనకు స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్న సోనమ్‌కపూర్‌తో కలసి అక్షయ్ ‘పాడ్‌మ్యాన్’ అనే సినిమా చేస్తున్నారు. జాతీయ అవార్డులు ప్రకటించినప్పుడు వీరిద్దరూ ఆ సినిమా లొకేషన్లోనే ఉన్నారు. -
ఒకేసారి ముగ్గురు!
ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్, సోనమ్‌కపూర్... ఒకరు ఎవర్గ్రీన్ బ్యూటీ అయితే, ఇంకొకరు అభిమానులకు డ్రీమ్‌గాళ్, మరొకరు హ్యపెనింగ్ హీరోయిన్. కేవలం వీళ్లు సినిమాల్లో ఉంటే వచ్చే అభిమానులు కోకొల్లలు. ఈ అందాల తారలు కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? సూపర్‌గా ఉంటుంది కదూ! ఇప్పుడదే జరుగు తోంది. అయితే ఇది వెండితెర మీద కాదు... కేవలం బుల్లితెర కోసమే. ఒక బహుళ జాతి సంస్థ యాడ్ కోసం టాప్ స్టార్స్ కలిసి నటించడం ఇదే మొదటిసారే. వెండితెరపై ఈ ముగ్గురూ కలిసి నటించే సంగతి మాటేమో కానీ, ఇప్పటికైతే బుల్లితెరపై అంతా కలిసి చేసిన ఈ యాడ్ కచ్చితంగా స్పెషలే కదూ! -
మా నాన్న బంగారం..
నేను నాన్న కూచిని అంటోంది బాలీవుడ్ నటి సోనమ్‌కపూర్. తామిద్దం క్లోజ్ ఫ్రెండ్స్‌లా ఉంటామంటోంది. తన తండ్రి అనిల్‌కపూర్‌తో అన్ని సంగతులు షేర్ చేసుకుంటానని చెబుతోంది. కెరీర్ విషయాలే కాదు లవ్ మ్యాటర్స్ కూడా దాపరికం లేకుండా నాన్నతో చెప్పేస్తానని తెలిపింది. ‘ నేను చెప్పిన సీక్రెట్స్ అన్నీ నాన్న మనసులోనే దాచుకుంటాడు. కనీసం అమ్మ దగ్గర కూడా ఓపెన్ చేయడు’ అని అంటున్న ఈ అమ్మడు.. అందుకే మా నాన్న బంగారం అని కితాబిచ్చింది.