
జైలులో థ్రిల్ !
మంత్ర, మంగళ వంటి వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ఓషో తులసీరామ్. కొంత గ్యాప్ తర్వాత ఆయన మళ్లీ మెగా ఫోన్ పడుతున్నారు. ఇప్పటికే తను తీసిన రెండు చిత్రాలు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కాగా మరోసారి అర్చన (వేద) ప్రధాన పాత్రలో ఆ తరహా చిత్రం తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు. ఎమ్‌ఎమ్ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. తులసీరామ్ మాట్లాడుతూ- ‘‘ జైలు నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రేక్షకుల ఊహకందని థ్రిల్లింగ్ అంశాలు చాలా ఉంటాయి. అక్టోబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు.