దీపావళికి రావడం ఖాయం! | Tollywood actor Akhil Akkineni's debut flick 'Akhil: The Power of Jua' to release on November 11? | Sakshi
Sakshi News home page

దీపావళికి రావడం ఖాయం!

Published Sun, Nov 1 2015 10:27 PM | Last Updated on Sun, Sep 3 2017 11:50 AM

దీపావళికి రావడం ఖాయం!

దీపావళికి రావడం ఖాయం!

అక్కినేని కుటుంబం అభిమానులకు ఓ తీపి వార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘అఖిల్’ దీపావళికి వచ్చేస్తున్నాడు. అఖిల్ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో హీరో నితిన్ నిర్మించిన ఈ చిత్రం వాస్తవానికి దసరాకి విడుదల కావాల్సింది. సినిమాకి సంబంధించిన కీలక ఎపిసోడ్‌లో గ్రాఫిక్స్ సరిగ్గా కుదరక పోవడంతో విడుదల వాయిదా వేశామని నాగార్జున పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. అప్పట్నుంచీ విడుదల తేదీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను రీ-షూట్ చేస్తున్నారనే వార్త వచ్చింది.

అందులో నిజం లేదని అఖిల్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఆ వెంటనే సంక్రాంతికే ఈ చిత్రం విడుదల అంటూ మరో వార్త హల్‌చల్ చేసింది. కానీ, దీపావళి పండగను పురస్కరించుకుని ఈ నెల 11న చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నితిన్ తెలియజేయడంతో ఆ వార్తకు ఫుల్‌స్టాప్ పడింది. భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ చిత్రం ఆ అంచనాలను చేరుకుంటుందని నితిన్ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్. వెంకటరత్నం, సమర్పణ: నిఖితారెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement