ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్.. స్పైడర్ | top trending in twitter is spyder of Mahesh babu | Sakshi
Sakshi News home page

ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్.. స్పైడర్

Published Wed, Apr 12 2017 6:21 PM | Last Updated on Sun, Jul 14 2019 1:42 PM

ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్.. స్పైడర్ - Sakshi

ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్.. స్పైడర్

ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మహేష్ బాబు - మురుగదాస్ సినిమా ఫస్ట్ లుక్ బయటకు రావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా మోతెక్కిపోతోంది. దేశవ్యాప్తంగా ట్విట్టర్‌లో ఇదే టాప్ ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. ట్విట్టర్ ఇండియా ట్రెండ్స్ చూస్తే అందులో #Spyder మొదటి స్థానంలో ఉంది. దాంతోపాటు #Mahesh23, Mahesh Babu అనేవి కూడా ట్రెండింగులో కనిపిస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్‌లో కూడా రెండు రకాల డ్రస్సుల్లో మహేష్ కనిపిస్తాడు.

బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ కూడా మహేష్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ట్వీట్ చేశారు. మహేష్ బాబు, ఏఆర్ మురుగదాస్‌లది చాలా డైనమిక్‌ కాంబినేషన్ అని పేర్కొన్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లు అద్భుతంగా ఉన్నాయంటూ ట్వీట్ చేశారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ పోస్టర్‌ను రీట్వీట్ చేసింది. హాస్యనటుడు వెన్నెల కిషోర్ అయితే ఇది సూపర్ స్టార్ డే అంటూ చెప్పాడు. దర్శకుడు మలినేని గోపీచంద్ సైతం ఈ లుక్‌కు ఫిదా అయిపోయారు. సింప్లీ సూపర్బ్ అండ్ స్టన్నింగ్ లుక్ అని చెప్పారు. ఇంకా పలువురు సినీ విమర్శకులు, అభిమానులు సైతం మహేష్ బాబు నటిస్తున్న 23వ చిత్రం ఫస్ట్ లుక్‌ను అభినందనలతో ముంచెత్తారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement