త్రిష ఇల్లన్నా నయనతార కాంబినేషన్‌ రిపీట్‌ | Trisha Illanna Nayanathara is the scene of obscene and obscene conversations | Sakshi
Sakshi News home page

త్రిష ఇల్లన్నా నయనతార కాంబినేషన్‌ రిపీట్‌

Published Sun, Jul 2 2017 1:31 AM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM

త్రిష ఇల్లన్నా నయనతార కాంబినేషన్‌ రిపీట్‌

త్రిష ఇల్లన్నా నయనతార కాంబినేషన్‌ రిపీట్‌

తమిళసినిమా: త్రిష ఇల్లన్నా నయనతార చిత్రం ఆ మధ్య విడుదలై కమర్శియల్‌గా సక్సెస్‌ అనిపించుకుని వసూళ్లను రాబట్టుకున్నా చిత్రం అంతా అశ్లీల దృశ్యాలు, అసభ్య సంభాషణలు అంటూ విమర్శకులు చేతిలో నలిగిపోయింది.అంతే కాదు అందులో నటించిన నటి ఆనంది కూడా తనను అశ్లీలంగా చూపించారని దర్శకుడిపై మండిపడింది. ఇంతకీ ఆ చిత్ర హీరో ఎవరన్నది ప్రత్యేకంగా చెప్పనక్కరేదనుకుంటా ‘ ఎస్‌. యువ సంగీతదర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమారే ఆ చిత్ర కథానాయకుడు.

ఆదిక్‌ రవిచంద్రన్‌ దర్శకుడు.ఈయన ఇటీవల సంచలన నటుడు శింబు త్రిపాత్రాభినయం చేసిన అన్భానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌ చిత్రానికి దర్శకత్వం వహించారన్నది గమనార్హం. ఆ చిత్రాన్ని శింబు అభిమానులు సైతం దుమ్మెత్మి పోశారు. ఇక విమర్శకలైతే సరేసరి. కాగా దర్శకుడు ఆధిక్‌ రవిచంద్రన్‌ తాజాగా తదుపరి చిత్రానికి రెడీ అయ్యారని సమాచారం. తన తొలి చిత్ర హీరోనే తాజా చిత్రానికి ఎంచుకున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. హీరోయిన్‌ ఇతర నటీనటుల వివరాలు వెల్లడి కాకున్నా మొత్తం మీద త్రిష ఇల్లన్నా నయనతార కాంబినేషన్‌ రిపీట్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఆ చిత్రం సెట్‌ పైకి రావడానికి కొంచెం సమయం పడుతుంది. జీవీ.ప్రకాశ్‌కుమార్‌ ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతోయమ బిజీగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement