
అక్షరాలా ‘అఆ’
దర్శక, రచయిత త్రివిక్రమ్ తెలుగు ప్రేక్షకులకు అ, ఆలను సరికొత్త రీతిలో పరిచయం చేస్తున్నారు. మామూలుగా ‘అ’ అంటే అమ్మ... ‘ఆ’ అంటే ఆవు అని చదువుకున్నాం. కానీ, త్రివిక్రమ్ ఇప్పుడు ఈ అక్షరాలకు కొత్త అర్థం చెబుతున్నారు. ‘అ’ అంటే అనసూయ రామలింగం అనీ, ‘ఆ’ అంటే ఆనంద్ విహారిఅని అంటున్నారు. ఆనంద్ విహారి ఎవరంటే హీరో నితిన్. మరి... అనసూయ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఎందుకంటే, ఈ చిత్రంలో సమంత, అనుపమా పరమేశ్వరన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. కొత్త సంవతర్సం సందర్భంగా ఈ చిత్రం టైటిల్ ‘అ... ఆ’ లోగోను విడుదల చేశారు.
బాపుగారి శైలిలో కనిపి స్తున్న ఆ లోగో సింప్లీ సుపర్బ్ అనేలా ఉంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి మమత సమర్పణలో ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రం నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ ఈ చిత్రానికి కొత్త బృందాన్ని ఎంచుకున్నారు. సంగీత దర్శకు డిగా ‘కొలవెరి’ పాట ఫేమ్ అనిరుధ్, ‘లవ్ ఆజ్ కల్’ ఫేమ్ ఛాయాగ్రాహ కుడు నటరాజ సుబ్రమ ణియన్ తదితరులు తొలిసారి త్రివిక్రమ్‌తో జట్టుకట్టారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మ్యాజిక్ కోసం వెయిట్ అండ్ వాచ్.