యుద్ధంలో ఇద్దరూ హీరోలే!
యుద్ధంలో ఇద్దరు తలపడినప్పుడు ఒకరు గెలుస్తారు, మరొకరు ఓడుతారు. అందులో గెలిచినోడు హీరో, ఓడినోడు జీరో అవుతాడు! కానీ, ‘కృష్ణార్జున యుద్ధం’లో ఇద్దరూ హీరోలేనట! అదెలా? అనడిగితే... ‘యుద్ధం మొదలవుతోందిప్పుడే కదా! అప్పుడే చెప్పేస్తే ఎలా? కొన్నాళ్లు వెయిట్ చేయండి’ అంటోంది చిత్రబృందం.
ఇక్కడ కృష్ణుడూ.. అర్జునుడూ.. ఇద్దరూ నానీనే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై నాని హీరోగా సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించనున్న సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేయనున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ‘జెంటిల్‌మన్’లోనూ నాని ద్విపాత్రాభినయం చేశారు.
అయితే... అందులో ఒకరు హీరో, ఇంకొకరు విలన్. తాజా సినిమాలో మాత్రం రెండూ హీరో పాత్రలేనట! వచ్చే వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతోంది. కొన్ని రోజులు హైదరాబాద్‌లో షూటింగ్ చేసిన తరువాత , నెలాఖరున యూరప్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకు ‘హిప్ హప్’ తమొళ స్వరకర్త.